Kalki2898AD: కల్కి 2898AD కాన్సెప్ట్ తోనే కంగువ.. అంతకుముందు కూడా ఇదే కథతో రెండు చిత్రాలు!
Kalki 2898AD Update: టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. స్టార్ హీరోలో సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తాయి ..బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్న ఆశతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లాంటి హాలిడే సీజన్లో వస్తుందా చిత్రాల మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి వరుసగా ఒకే కాన్సెప్ట్ తో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ కి రాబోతున్నాయి. ఇది మూవీ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
Kanguva: టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు స్టోరీ పాయింట్ రాసేముందు చాలావరకు వైవిద్యంగా ఉన్న దానికి రచయితలు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు రొటీన్ కథ కాకుండా ఏదైనా కొత్త కథను సిద్ధం చేసుకుంటేనే సినిమాకి మంచి అంచనాలు ఏర్పరుతాయని డైరెక్టర్స్ నమ్ముతారు. కానీ కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒకేసారి విడుదల అయ్యే స్టార్ హీరోల సినిమాలలో కొన్ని కామన్ పాయింట్లు ఉండనే ఉంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ.. సూర్య కంగువకు అలాంటి పరిస్థితి ఎదురు కాబోతోంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ప్రభాస్ నటిస్తున్న కల్కి స్టోరీ విషయానికి వస్తే.. మహావిష్ణువు అంశ తో పుట్టిన భైరవ పాత్ర వందలాది సంవత్సరాలు కాలంలో ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం మహాభారత కాలం నుంచి మొదలై వర్తమానం దాకా సాగుతుంది. అంటే గతించి పోయిన 3102 బిసి కాలం నుంచి భవిష్యత్తులో ఉన్న 2898 ఏడి కాలం దాకా ఈ మూవీ కాన్సెప్ట్ సాగుతుంది. వివిధ యుగాలలో.. వివిధ రకాలుగా.. ఈ సినిమాలో దర్శకుడు నాగ అశ్విన్ హీరోని విహరింప చేస్తాడు అన్న విషయం గట్టిగా వినిపిస్తోంది.
మరోపక్క సూర్య కంగువ మూవీ విషయానికి వస్తే.. 1678 ప్రాంతంలో ఓ జాతి పోరాట యోధుడికి సంబంధించిన కథ. అతని గురించి 2024లో ఓ విద్యార్థి రీసెర్చ్ మొదలుపెడతాడు. దీని ద్వారా పూర్తి కాకుండా ఆగిపోయిన అతని జీవిత లక్ష్యాన్ని సాధించాలి అని అనుకుంటారు. కాగా ఈ సినిమాలో కూడా సూర్య భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలలో కనిపిస్తారట. ఒకరకంగా తీసుకుంటే ఈ రెండు సినిమాలలో హీరోలు రకరకాల గెటప్స్ మార్చినా ..బ్యాక్ డ్రాప్ వేరువేరుగా ఉన్నా ..కాన్సెప్ట్ కామన్ గా కనిపిస్తొంది. రెండు చిత్రాలు కూడా టైం ట్రావెల్ కి సంబంధించినవే.
గతంలో వచ్చిన బాలకృష్ణ ఆదిత్య 369, నందమూరి కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ బింబిసారలో కూడా ఇదే టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూపించారు. ఇక రాబోయే మెగాస్టార్ విశ్వంభర లో కూడా ఇదే తరహా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.
ఎన్నికలు ఉన్నా .. ఏమైనా.. మే 9 వ తారీఖున కల్కి 2898 ఏడి చిత్రాన్ని విడుదల చేయడానికి కల్కి మూవీ బృందం రెడీగా ఉంది. మరి కచ్చితంగా ఆరోజు విడుదల అవుతుందా లేదా అన్న విషయం చెప్పలేము గాని ఒకవేళ అయితే దాని ప్రభావం కంగువపై ఖచ్చితంగా పడుతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా కంగువ బ్యాలెన్స్ వర్క్ చాలా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం కరెక్ట్ టైం కి రెడీ అవుతుందా లేదా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎటు చూసినా టైం ట్రావెల్ కాన్సెప్ట్సే ఉండడం.. అన్ని భారీ చిత్రాలు కావడం.. నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది.
Also read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్.. టీజర్‌లో 'గాజు గ్లాస్' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook