1st Day Collection of Kalki 2898 AD: ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన అనగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి రికార్డు స్థాయిలో హిట్ టాక్ ను  సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు.. కూడా అంతే రేంజ్ లో వచ్చాయని చెప్పవచ్చు. అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్,  రాజేంద్రప్రసాద్,  మృనాల్ ఠాగూర్,  విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రూ .200కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు తెలుగు రాష్ట్రాలలో.m రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా..  ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం.. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా.. అయితే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్,  బాహుబలి 2 రికార్డులను చెరపలేకపోయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తొలిరోజే రూ.223 కోట్లు సాధించగా.. బాహుబలి 2 సినిమా తొలి రోజు రూ.217 కోట్లు సాధించి.. బెస్ట్ ఇండియన్ ఓపెనర్ మూవీస్ గా నిలిచాయి .ఇక కల్కి 2898AD సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మూడవ అతిపెద్ద భారతీయ ఓపెనర్ మూవీ గా నిలిచింది. అయితే నిన్న సాయంత్రం క్రికెట్ మ్యాచ్ కారణంగా ఈ లెక్కలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.  ఇక వారాంతం ముగిసే సరికి రికార్డు స్థాయిలో.. కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనడంలో సందేహం లేదు.


సినిమా కథ విషయానికి వస్తే.. మహాభారత కురుక్షేత్ర యుద్ధంతో మొదలైన ఈ సినిమా.. కలియుగం అంతం చూపిస్తారు.. ముఖ్యంగా ఇందులో శంబల ప్రాంతం,  కాంప్లెక్స్.. అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. దాదాపు రూ.600 కోట్ల  బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం లోపు ఇంతకు రెట్టింపు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. పైగా హ్యారీ పోటర్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ ను ఈ సినిమాకు ఉపయోగించడం జరిగింది .. ఇందులో ప్రత్యేకంగా నిలిచిన బుజ్జి వెహికల్ కి సుమారు రూ .4కోట్ల ఖర్చు.. చేశారట. ఇక ఇలా ఈ సినిమాలో ప్రతి అంశము కూడా చాలా అద్భుతంగా.. చూపించడం వల్లే సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయింది అని అంటున్నారు ప్రేక్షకులు.


Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి