Kalki Release Date: ప్రభాస్ హీరోగా మహానటి సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సాంకేతిక పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే ఈ చిత్రం వచ్చిన గ్లింప్స్ ద్వారా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ వారు దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి, చాలా మంది స్టార్ కాస్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఈ చిత్ర కథ పరంగా చెప్పాలి అంటే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా గతంలో కల్కి సినిమాలో మన హిందూ పురాణాల ప్రకారం చెప్పిన ఏడు మంది చిరంజీవిలు ఉంటారు అని తెగ రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్ నిజమేమో అన్నట్టు నిన్న  అమితాబ్ బచ్చన్ ని అశ్వత్థామగా ఈ సినిమాలో నటించబోతున్నట్టు క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా.. ఏడుగురు చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ క్యారెక్టర్ కల్కి సినిమా నుంచి రివీల్ చేయడంతో ఈ సినిమా గురించి కొన్ని డౌట్స్ ని ప్రేక్షకులలో కలిగించింది.


మన హిందూ పురాణాల ప్రకారం వేద వ్యాసుడు, అశ్వత్థామ, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, కృపాచార్య, బలి చక్రవర్తి లను చిరంజీవులు అంటారు. అంటే వీరందరూ కూడా మరణం లేని వారు అని. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరివరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని హిందువుల నమ్మకం. నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు వస్తున్న వార్త ఈ అమిటాబ్  గ్లిమ్స్ తో మరింత ఊపు అందుకుంది. ఇక మిగతా ఆరుగురు చిరంజీవిలుగా ఎవరి నటించబోతున్నారు అని న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. కాగా కల్కి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళిలు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ వచ్చింది. వీళ్ళే ఆ చిరంజీవులు పాత్రలు చేసి సినిమాలో కొద్దిసేపు మెరిపిస్తారని తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎంత మాత్రం నిజమో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాలి.


Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి


Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter