Prabhas: ప్రభాస్ గతేడాది 'సలార్'మూవీతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలతో పలకిరంచబోతున్నాడు. అందులో 'కల్కి 2898 AD' మూవీ ఉంది. ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అటు 'ది రాజా సాబ్', స్పిరిట్, సిద్ధార్ధ్ ఆనంద్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్.. తన స్నేహితుడు మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తూ నిర్మిస్తోన్న 'కన్నప్ప' మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కన్నప్ప'లో ప్రభాస్ మహా శివుడి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలో కన్నప్పతో శివుడు ద్వంద్వ యుద్ధ ఘట్టం ఉంది. ఈ సినిమాలో ఇదే హైలెట్ సీన్. ఈ సినిమాలో పార్వతి మాత పాత్ర కోసం నయనతారను సంప్రదించారు. కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. తాజాగా జాతీయ ఉత్తమ నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఈ సినిమాలో పార్వతి మాత పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్' సినిమాలో వీళ్లిద్దరు జోడిగా నటించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత వెండితెరపై వీళ్లిద్దరు పార్వతి పరమేశ్వరులుగా దర్శనమివ్వనున్నారు. రీసెంట్‌గా కంగనా.. చంద్రముఖి 2లో ఇక్కడ ప్రేక్షకులను పలకరించింది.


ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వంటి హీరోలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ప్రభాస్.. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'యాక్షన్ జాక్సన్‌'లో కెమియో రోల్ చేసారు. అది ఓపెనింగ్స్‌కు పెద్దగా ఉపయోగాపడలేదు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత కన్నప్ప సినిమాలో ప్రభాస్ అతిథి పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ 'కన్నప్ప' మూవీకి ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయా లేదా అనేద చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ రాకతో 'కన్పప్ప' రేంజే మారిపోయింది.  


ఈ సినిమాను రూ. 100 కోట్ల బడ్టెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి కథకు మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.


Also Read: Yashasvi Jaiswal: ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫ్లాట్ కొన్న యశస్వి.. ధర తెలిస్తే షాక్ అవుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి