Har Ghar Tiranga Song: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: మరికొద్ది రోజుల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా హర్ ఘర్ ఘర్ తిరంగా సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కీర్తి సురేష్, దేవి శ్రీ ప్రసాద్ కనిపిస్తున్నారు.
Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: ఈ ఏడాది జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతూ ఉండడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ అంశం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తాజాగా బుధవారం నాడు హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం అంటూ సాగుతున్న ఒక పాటను విడుదల చేశారు.
ఇందులో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ క్రికెటర్ కి విరాట్ కోహ్లీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సహా మరికొందరు కనిపించారు. ఇక ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలి అంటే హర్ ఘర్ తిరంగా అంటూ ఒక నినాదాన్ని మోడీ ఇటీవల ప్రకటించారు, ఇక దీనికి సంబంధించి ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సాంగ్లో ప్రభాస్, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సైతం కనిపించారు. ప్రభాస్ తెలుగులో ఇంటింటా జెండా అంటూ తన గొంతు కలపగా కీర్తి సురేష్ తమిళంలో గొంతు కలిపింది. ఇక ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించినట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ సాంగ్లో మనవాళ్లు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ, అమితాబచ్చన్, కపిల్ దేవ్, ఆశాభోంస్లే వంటి వారు కూడా కనిపించారు. ఇక ఆశాభోంస్లే పాడిన ఈ సాంగ్ దేశభక్తులకు అందరికీ నచ్చుతుందని చెప్పచ్చు. సోను నిగమ్ కూడా ఇందులో తన గొంతు తెలిపారు. ప్రభాస్ ఒక జాతీయ జెండా చేత్తో పట్టుకొని ఉండగా ఆయనపై జాతీయ పతాకం ఉన్న హెలికాప్టర్ ఎగురుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ పాటను మీరు కూడా చూసేయండి మరి.
Read Also: Prabhas: ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?.. పరిశ్రమపై ప్రభాస్ కామెంట్స్ వైరల్!
Read Also: Neha Shetty: నేహా శెట్టి హాట్ ట్రీట్.. రెచ్చిపోతున్న రాధిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook