Prabhas Movie with Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్.. ఆ సినిమాల తర్వాత మారుతి సినిమా చేసే ఛాన్స్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్మాత డీవీవీ దానయ్యతో (Dvv Danayya) సినిమాకు ప్రభాస్ (Prabhas) చాలా రోజుల క్రితమే కమిట్ అయ్యారు. ప్రభాస్‌తో సినిమా కోసం దానయ్య డైరెక్టర్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతి తన వద్ద ఉన్న ఓ స్క్రిప్టుతో దానయ్యను కలిసినట్లు తెలుస్తోంది. మారుతి స్క్రిప్టు నచ్చిన దానయ్య.. దాన్ని ప్రభాస్‌కు రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు మారుతి కథ చెప్పడం.. అందుకు రెబల్ స్టార్ ఓకె చెప్పడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ నెరేషన్ కోసం మారుతి మరోసారి ప్రభాస్‌ను కలవనున్నారట.


సాధారణంగా ప్రభాస్ తన ఒక్కో సినిమాకు చాలా టైమ్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. మరోవైపు, మారుతి మాత్రం తన సినిమాలను చాలా స్పీడ్‌గా పూర్తి చేస్తారు. కాబట్టి.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే.. అదే సమయంలో మారుతి సినిమాను కూడా ప్రభాస్ పట్టాలెక్కించవచ్చునని చెబుతున్నారు. ప్రభాస్‌తో (Prabhas Latest) మారుతి తీసే సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉండవచ్చునని ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సంక్రాంతి పండగకు ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదలయ్యేది. అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగడంతో రాధేశ్యామ్ వాయిదా పడక తప్పలేదు. దీంతో ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పలేదు.


Also Read: Ganguly - Kohli: అవన్నీ గాలి వార్తలే.. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో: గంగూలీ


Also Read: IPL 2022 Auction:​ కెప్టెన్​గా హార్దిక్.. అహ్మదాబాద్ ఎంచుకున్న ప్లేయర్స్ వీరే! లక్నో సారథి, కోచింగ్ లిస్ట్ ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook