prabhas Adipurush Teaser : ఆదిపురుష్‌ టీజర్ మొత్తానికి విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల కోరిక నెరవేరింది. ఎన్నో రోజుల నుంచి ఆదిపురుష్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆదిపురుష్ అప్డేట్ వస్తుందని గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతీ పండుగకు ఆదిపురుష్ నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూడసాగారు. అలా ఎన్నో పండుగలు పోయాయి. కానీ అప్డేట్ మాత్రం రాలేదు. శ్రీరామనవమికి కచ్చితంగా అప్డేట్ వస్తుందని ఆశించారు. కానీ చివరకు ఎదురుదెబ్బే తగిలింది. అలాంటి అభిమానులు ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అసలే ఆదిపురుష్ టీజర్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశాడు ఓం రౌత్. ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ కోసం పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. రాముడు నడయాడిన నేలపైనే ఆదిపురుష్ టీజర్‌ను లాంచ్ చేశారు. దీనికోసం అయోధ్యలో భారీ ఎత్తున ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరయు నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోనే ఆదిపురుష్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌ను దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా తిలకిస్తోంది. ప్రభాస్ అభిమానులే కాకుండా దేశమంతా కూడా రాముడి రూపాన్ని ప్రభాస్ రూపంలో చూసుకునేందుకు ఎదురుచూసింది.


భూమి కుంగినా నేల చీలినా..  న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం..  వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి..  ఆగమనం.. అధర్మ విధ్వంసం..  అనే డైలాగ్స్ అదిరిపోయాయి.  నీటిలో ధ్యానం చేస్తున్న షాట్, రామసేతు మీద నడుస్తున్న షాట్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంది. ఈ షాట్స్‌కు ఎవ్వరైనా సరే దండం పెట్టాల్సిందే అన్నట్టుగా ఉంది. ఇందులో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ అదరగొట్టేశాడు. అయితే రాముడిగా మాత్రం ప్రభాస్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా ఉన్నాడు. విజువల్స్ కోసం దర్శకుడు ఎంత తాపత్రపడ్డాడు, గ్రాఫిక్స్ వర్క్స్ కోసం ఎంతలా కష్టపడ్డాడో ప్రతీ ఫ్రేములో కనిపించింది. త్రీడీలో చూస్తే మాత్రం ఎప్పటికీ అలా మన మైండ్లోనే ఉండిపోయాలే ఉంది. పోరాట సన్నివేశాలు, రాముడిగా విల్లు ఎక్కుపెట్టే ప్రభాస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.మొత్తానికి ఆదిపురుష్ టీజర్ వచ్చింది. అందరినీ మెప్పించేసింది. ఇందులో ప్రభాస్‌ను రాముడిలా చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. ప్రభాస్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ జోరు చూస్తుంటే సోషల్ మీడియాలో ఇది వరకు ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలయ్యేలా ఉంది. టీజర్ మాత్రం లైక్స్, వ్యూస్ విషయంలో యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.


ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి సంక్రాంతి సీజన్ మాత్రం ఆదిపురుష్‌దే అని ఈ టీజర్ బట్టి తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఆదిపురుష్‌తో పోటి పడేందుకు తెలుగులో ఏ హీరోనైనా ముందడుగు వేస్తాడో లేదో చూడాలి. చూస్తుంటే సింగిల్‌గానే ప్రభాస్ రంగంలోకి దిగేలా ఉన్నాడు. మిగతా వారంతా కూడా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.


Also Read : Ananya Nagalla Marriage: నాకు మొగుడిని వెతికినందుకు థాంక్స్.. ఇంకా ఆ విషయాలు కూడా చెప్పండి: అనన్య నాగళ్ల


Also Read : Adipurush Teaser : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. సరయు నదిలోంచి ఆదిపురుష్ పోస్టర్?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook