Prabhas photos and videos leaked from Salaar sets: ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలు, వీడియో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లీకైన వీడియోలో ప్రభాస్ లుక్ చూస్తే.. బ్రౌన్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటులో అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆ వెనకే మేకప్ మ్యాన్, అసిస్టెంట్స్, యూనిట్ స్టాఫ్ ప్రభాస్‌ను అనుసరిస్తుండటం గమనించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే లీకైన ఫోటోల్లో ప్రభాస్ స్టైలిష్‌గా జేబులో చేతులు పెట్టుకుని నిలబడి ఉండగా.. ఎదురుగా ప్రభాస్ శ్రీను నిలబడి మాట్లాడుతుండటం చూడవచ్చు. 



 


ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఫోటోలు, వీడియోలు చూసి పండగ చేసుకుంటున్నప్పటికీ.. సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి (Director Prashanth Neel) మాత్రం అది పట్టరాని కోపం తెప్పిస్తోందట. ఇలా అయితే, ఇకపై కీలక సన్నివేశాల షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావనే గ్యారెంటీ ఏముందని ప్రశాంత్ నీల్ సలార్ మూవీ క్రూపై (Salaar movie) ఆగ్రహం వ్యక్తంచేశాడట. 



 


సలార్ మూవీలో ప్రభాస్ (Prabhas in Salaar) సరసన శృతి హాసన్ జంటగా నటిస్తోంది. ఇప్పటికే శృతి హాసన్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా తనకు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్‌కి థాంక్స్ చెబుతూ శృతి హాసన్ (Actress Shruti Haasan) తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.