Prabhas, Pooja Hegde's Radhe Shyam Movie Pre-Release Event on December 23 in Ramoji Film City : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, (Prabhas) బ్యూటీఫుల్ భామ పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ రాధేశ్యామ్‌. ఈ పాన్‌ ఇండియా మూవీ ప్రీరిలీజ్‌ వేడుక ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు రాధేశ్యామ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ ప్రీరిలీజ్‌ వేడుక ఫ్యాన్సే చీఫ్ గెస్ట్స్ (Chief Guests) అని మూవీ యూనిట్ పేర్కొంది. కోవిడ్‌ నిబంధనలకు పాటిస్తూ రాధేశ్యామ్‌ మూవీ ప్రీరిలీజ్‌ వేడుకలో (Radheshyam Movie Prerelease Celebration) చిత్ర బృందం కోరింది. ప్రీరిలీజ్‌ వేడుకలో రాధేశ్యామ్‌ మూవీ ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్‌ అభిమానుల (Prabhas‌ fans) చేతుల మీదుగానే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధేశ్యామ్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌పై, మూవీ యూనిట్‌తో పాటు హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hegde) సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.



 


Also Read : BJP MLA Raja Singh: దేవిశ్రీప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్


రాధేశ్యామ్‌ మూవీ 1970ల కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీ. ఈ మూవీకి కేకే రాధాకృష్ణ కుమార్‌ డైరెక్టర్. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ కీలక పాత్రలు పోషించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ రూపొందించిన ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంంది. ఈ మూవీని గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి వివిధ భాషల్లో మ్యూజిక్ జస్టిన్‌ ప్రభాకరన్‌, అర్జిత్‌ సింగ్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ అందించారు. ఫొటోగ్రఫీ మనోజ్‌ పరమహంస నిర్వహించారు.



 


Also Read : Brahmastra Motion Poster: రణ్ బీర్ - అలియా నటించిన 'బ్రహ్మాస్త్ర' మోషన్ పోస్టర్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook