Dasara Movie: ఏం సినిమారా బాబూ.. దసరా గురించి ప్రభాస్ పోస్ట్ వైరల్!
Prabhas Comments on Dasara Movie: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మీద ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వివరాలు
Prabhas Praises Dasara Movie: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా రచ్చ రేపుతోంది. వాస్తవానికి ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసినంత డబ్బు రెండు మూడు రోజుల్లో చేయకపోయినా సినిమాకి పాజిటివ్ టాక్ మాత్రం వస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో ఆడుతోంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తే తెలుగు మినహా మిగతా ఏ భాషలోనూ పెద్దగా క్లిక్ అవ్వలేదు. కేవలం తెలుగులోనే దాదాపు 28 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే కేవలం ఇతర భాషలన్నీ కలిపి కోటి రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదని అంటున్నారు. అయితే ఈరోజు ఆదివారం కలెక్షన్స్ బాగా పెరుగుతాయి అని సినిమా యూనిట్ అంచనా వేస్తోంది.
ఇక ఈ సినిమా చూసిన వారంతా సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే దసరా సినిమా చూశానని అబ్బా ఏం సినిమా? నేనైతే భలే ఎంజాయ్ చేశాను, నానికి కంగ్రాట్స్, శ్రీకాంత్ ఈ సినిమా డైరెక్టర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
కీర్తి సురేష్ అలాగే మిగతా టీం అంతా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలను మరిన్ని మనం చేయాలి అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఆయన చేసిన పోస్ట్ కి అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా షేర్ చేశారు. ఈ మేరకు ఆయన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ షేర్ చేశారు.
Also Read: Vijay Devarakonda: ఖుషీ మీదే విజయ్ దేవరకొండ ఫోకస్..మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది?
Also Read:Agent Release Date: ఏజెంట్ రిలీజ్ డేట్ టెన్షన్.. దర్శక-నిర్మాతల మధ్య దూరం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook