Prabhas Radhe Shyam Love Anthem ‘One Heart, Two Heart Beats’ song teaser out tomorrow: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. పూజా హెగ్డేల తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ మూవీ జనవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరు పెంచింది. ఫ్యాన్స్ కోరిక మేరకు ఇకపై గ్యాప్‌ లేకుండా వరుసగా అప్‌డేట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధే శ్యామ్ (Radhe Shyam) పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఈ రాతలే సాంగ్ కు మంచి ఆదరణ లభించింది. ఈ మూవీలో మరో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.


Also Read : Newzealand MP: డెలివరీ కోసం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లిన మహిళా ఎంపీ


రాధేశ్యామ్ నుంచి వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ (One heart, two heartbeats) సాంగ్ లాంచ్‌కు ముందు దాని టీజర్ ను (teaser) రేపు రిలీజ్ చేయనున్నారు. లవ్ ఆంథెమ్ (Love Anthem) సాంగ్ హిందీ టీజర్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు లాంచ్ కానుంది. ఇక తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. 



 


గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్.. యువీ క్రియేషన్స్‌ (uv creations) ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రాధే శ్యామ్ మూవీని జిల్ పేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. 


Also Read : Madhya Pradesh Taj Mahal Replica: భార్య కోసం మరో తాజ్ మహల్ కట్టిన అభినవ షాజహాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook