Prabhas Sequel Formula for Salaar: బాహుబలి లాంటి సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు,  అయితే తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే బాహుబలి సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత ప్రభాస్ కి ఒక్క సినిమా కూడా హిట్ లేదనే చెప్పాలి, ఎందుకంటే సాహో సినిమా వసూళ్లు రాబట్టిన సరే ప్రేక్షకులను మాత్రం సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన రాధేశ్యామ్ సినిమా ఎలాంటి డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఎలా అయినా హిట్ అందుకోవాలని ఆశతో ప్రభాస్ ఉన్నాడు. ఆయన హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు కానీ అది వాయిదాలు పడుతూ వెళుతుంది. అయితే సినిమా మొత్తం మోషన్ గ్రాఫిక్స్ ని ఆధారంగా చేసుకుని తరికెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద అటు ప్రభాస్ అభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో ప్రభాస్ తన సక్సెస్ ఫుల్ సీక్వెల్ ఫార్ములాని రిపీట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.


కొద్ది రోజుల క్రితం నుంచి సలార్ సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరగగా లేదు, అది ఒకే భాగంలో విడుదలవుతుందని మరో  ప్రచారం అయితే జరిగింది. ఇక తాజాగా ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు సలార్ రెండు భాగాలుగా విడుదలవుతుంది. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల అవుతూ ఉండగా రెండో భాగం మాత్రం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు.


ఇక సలార్ షూటింగ్ ఈ నెలాఖరితో పూర్తవుతుందని, కొంత మేర ప్యాచ్ వర్క్ ఉంటుందని, అది ఈ మధ్యలో ఎప్పుడైనా చేయబోతున్నారని అంటున్నారు. మొత్తం మీద ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆయన అభిమానులు సహా సాధారణ టాలీవుడ్ ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. ఎందుకంటే ప్లాన్ ఇండియా స్థాయిలో మొట్టమొదటి హీరోగా నిలబడిన ప్రభాస్కు బాహుబలి తర్వాత సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటే చూడాలని ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!


Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook