HBD Deepika padukone.. ప్రాజెక్ట్ కే ఆశాకిరణం.. ప్రభాస్ పోస్ట్ వైరల్
Deepika Padukone poster From Project k దీపిక పదుకొణె బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. పఠాన్ నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశార. ఇక ప్రాజెక్ట్ కే నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
Deepika Padukone poster From Project k ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. మహానటి తరువాత ప్రాజెక్ట్ కే సినిమాను చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇది పాన్ ఇండియా కాదని, పాన్ వరల్డ్ అని నాగ్ అశ్విన్ ఎన్నో సార్లు చెబుతూ వచ్చాడు. ఈ సినిమా కోసం సపరేట్‌గా కార్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు నాగ్ అశ్విన్. ఇలా ఈ సినిమా కోసం సపరేట్‌గా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు.
అలాంటి ఈ ప్రాజెక్ట్ కే నుంచి తాజాగా దీపిక పదుకొణె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మొత్తంగా దీపిక పదుకొణె మొహాన్ని చూపించలేదు. లుక్ ఎలా ఉండబోతోందో హింట్ మాత్రమే ఇచ్చారు. అయితే చీకటి కమ్ముకున్నప్పుడు ఆశా కిరణంలా వచ్చి వెలుగులు నింపుతుంది అన్నట్టుగా దీపిక పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చారు.
ఇక ఇదే పోస్టర్‌ను ప్రభాస్ షేర్ చేస్తూ విషెస్ అందించాడు. ఎంతో అందమైన, టాలెంటెడ్ నటి అయిన దీపికకు హ్యాపీ బర్త్ డే.. అంటూ పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్, వాటి విషయాలు, వాటికి అవుతున్న ఖర్చు, పెడుతున్న బడ్జెట్ ఇలా ప్రతీ ఒక్కటి హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
వైజయంతీ మూవీస్ మాత్రం ప్రాజెక్ట్ కే కోసం ఎంతైనా పెట్టేందుకు సిద్దంగా ఉంది. ఇది పాన్ వరల్డ్ అని ముందు నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇదేమీ టైమ్ ట్రావెల్ కథ కాదని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తానికి దీపిక పదుకొణె ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట
Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి