Salaar Movie: ఇప్పడు అందరి దృష్టీ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపైనే. అందరూ ఊహించినట్టుగా సినిమా ఒక భాగంలో ఉండదట. సలార్ సినిమా కేజీఎఫ్‌లానే రెండు భాగాల్లో ఉంటుందని ప్రశాంత్ నీల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. అందుకే ఇప్పడు సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సృష్టికర్త ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఇప్పుడు అందరి దృష్ఠినీ ఆకర్షిస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముందు రాధేశ్యామ్ తరువాత ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ప్రభాస్ కెరీర్ ప్రశ్నార్ధకమైందా అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అందరి ఆశలు ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల ఆశలు సలార్ సినిమాపై పడ్డాయి. మొన్న విడుదలైన సలార్ టీజర్ ద్వారా సినిమా రెండు భాగాల్లో ఉంటుందని స్పష్టత ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాపై క్రేజ్, ఆసక్తి ఎంతలా ఉన్నాయంటే..టీజర్‌లో ప్రభాస్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా కన్పించడు. అయినా టీజర్ వ్యూస్ 100 మిలియన్లు దాటేసిందట.


సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో అంటే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్సే ఈ చిత్రాన్ని తీస్తోంది. సలార్ టీజర్ తరువాత ట్రైలర్ ఆగస్టులో విడుదల కావచ్చు. 


సలార్ సినిమాలో ప్రభాస్ సరసన ఆద్య పాత్రలో శృతి హాసన్ నటించింది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు, జగపతి బాబు కన్పించనున్నారు. రవి బస్రూర్ చిత్రానికి సంగీతం అందిస్తారు. సలార్ సినిమా బాక్సాఫీసు వద్ద 2000 కోట్ల కలెక్షన్లు సృష్టిస్తుందనే నమ్మకం తనకుందని హస్య నటుడు సప్తగిరి స్పష్టం చేశారు. సినిమాలో తనకు అవకాశమిచ్చిన హీరో ప్రభాస్, దర్సకుడు ప్రశాంత నీల్, హోంబలే ఫిలిమ్స్‌కు ‌సప్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు బాహుబలి 2 బాక్సాఫీసును బద్తలు గొట్టింది. తిరిగి ఇప్పుడు సలార్ అంతకంటే బలమైన పరిస్థితికి వస్తుందని అంచనాలున్నాయి.


Also read: Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook