Salaar OTT: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబో పాన్ ఇండియా సినిమా సలార్ ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఇక సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం, సైంథవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు సైతం అలరిస్తున్నాయి. ఇప్పుడు సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయిన ప్రభాస్‌కు సలార్ మంచి మెగా హిట్ అందించింది. అంచనాలకు తగ్గట్టే భారీగా బాక్సాఫీసు కలెక్షన్లు కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 700 కోట్లు దాటి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక థియేటర్ రన్ పూర్తయ్యేసరికి 800 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే త్వరలో స్ట్రీమింగ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన 45 రోజుల తరువాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సలార్ విషయంలో కూడా అదే ఒప్పందం జరిగింది. అందుకే ఫిబ్రవరి 4 లేదా 9 తేదీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్దమౌతోంది. 


ఈ ఏడాది విడుదల కానున్న పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర, విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో సినిమా, డీజే టిల్లు 2 ఇలా వరుస సినిమాలన్నింటినీ నెట్‌ఫ్లిక్స్ ముందే బుక్ చేసుకున్నట్టుంది. నెట్‌ఫ్లిక్స్ పండుగ అంటూ ఏడాదిలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల పోస్టర్లు విడుదల చేసింది. 


Also read; Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook