Radhe Shyam Movie: ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'(Radhe Shyam Movie). పూజాహెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటించగా...‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే  రాధేశ్యామ్‌’ సినిమా కోసం ఆస్ట్రేలియా(Australia)లో స్పెషల్‌ షోలు వేయనున్నారు. అది కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్(Largest IMAX Screen)గా గుర్తింపు తెచ్చుకున్న మెల్‌బోర్న్‌ నగరంలోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెల్‌బోర్న్‌లో 105*75 అడుగులున్న ఈ ఐమ్యాక్స్‌ థియేటర్‌ కొద్ది కాలం క్రితం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌గా ఉండేది. అయితే జర్మనీలో 144*75 ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌ ఏర్పాటుకావడంతో మెల్‌బోర్న్‌ ఐమ్యాక్స్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడీ ఈ భారీ తెరపైనే ‘రాధేశ్యామ్‌’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. జనవరి 14న ఉదయం 7.30 గంటలకు ‘రాధేశ్యామ్’ స్పెషల్‌ షో మొదలవుతుంది. యూవీ క్రియేషన్స్(UV Creations) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 




Also Read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సాంగ్ అప్డేట్.. 'రోర్ ఆఫ్ భీమ్' రిలీజ్ ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook