కృష్ణంరాజుని ఇబ్బంది పెడుతున్న ప్రభాస్ పెళ్లి !
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ పెళ్లి, టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి.. రెండూ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌనే.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ పెళ్లి, టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి.. రెండూ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌనే. సల్మాన్‌కి వున్నంత ఏజ్ ప్రభాస్‌కి లేకపోయినా.. ఇంతకు ముందు ఏ స్టార్ హీరో పెళ్లికి జరగనంత ప్రచారం ప్రభాస్ పెళ్లి గురించి జరిగింది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌కి పెళ్లంట అనే వార్త ఇవాళ కొత్తది కాదు. గత రెండు, మూడేళ్లుగా ఇదిగో ప్రభాస్ పెళ్లి, అదిగో ప్రభాస్ పెళ్లి అని ఎన్నోసార్లు మీడియాలో వార్తలొచ్చాయి. కొన్నిసార్లయితే ఇదిగో ఈ అమ్మాయే ప్రభాస్‌కి కాబోయే భార్య అంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక అనుష్క, ప్రభాస్‌లకి ముడిపెడుతూ వచ్చిన వార్త కథనాల గురించి అయితే చెప్పుకోనక్కరేలేదు.
ఇదిలావుంటే, తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల్లోకొచ్చింది. నిన్న ప్రభాస్ పెదనాన్న, నాటి రెబల్ స్టార్ హీరో కృష్ణం రాజు పుట్టిన రోజు. కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆయనను కలిసిన మీడియా మిత్రులు.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ ఎప్పటిలాగే ప్రశ్నించారట. వాళ్ల ప్రశ్న వినడంతోనే నవ్వుకున్న కృష్ణంరాజు.. ఇటీవల కాలంలో ఇది ఓ సమాధానం చెప్పలేని ప్రశ్న అయిపోయింది అని అన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి అయిపోతుంది. ప్రభాస్ కూడా పెళ్లికి సిద్ధంగానే వున్నాడు అని చెప్పినట్టు సమాచారం. ఈమేరకు ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది.