Prabhas: ప్రభాస్ ని వెంటాడుతున్న సమస్య.. ఇంకా తగ్గలేదా!
Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అయితే ఈ మధ్య తన కాళ్ళకి సంబంధించి చిన్న సర్జరీ చేసుకున్న మన డార్లింగ్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Prabhas Viral Photo: వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న హీరో ప్రభాస్. ఈ మధ్యనే సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ఈ చిత్రా రెండో భాగం షూటింగులో అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్టు కే .. కల్కి 2898AS షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మారుతీ దర్శకత్వంలో వస్తోన్న రాజా డీలక్స్ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
ఈ చిత్రాల నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాలపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ కి సంబంధించిన ఒక సమస్య మాత్రం ఆయన అభిమానులను కలవరపెడుతోంది.
విషయానికి వస్తే బాహుబలి సినిమా దగ్గరనుంచి ప్రభాస్ మోకాలి నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభాస్ తన గత చిత్రం ‘సలార్’ రిలీజ్ కి ముందు శాస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం యూరప్ వెళ్లారు. దాదాపు నెలపాటు అక్కడే ఉంది ట్రీట్మెంట్ తీసుకొని మరి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక అంతా సర్దుకున్నట్టే అని ప్రభాస్ మోకాలికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అందరూ అనుకున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఫోటో.. ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా అనే సందేహాన్ని ఆయన అభిమానుల్లో కలిగిస్తుంది. ఈ మధ్యనే కల్కి మూవీ షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీకి వెళ్ళాడు. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై ఓ రొమాంటిక్ పాటని సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ షూటింగ్ సెట్స్ నుంచి ఏదొక ఫోటో బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతున్న ఫోటో ఒకటి బయటకు రాక ఆ ఫోటోలు ప్రభాస్.. చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటో కాస్త వైరల్ కాగా కొంతమంది ప్రభాస్ కి ఇంకా మోకాలి నొప్పి తగ్గినట్లు లేదనుకుంటాం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మోకాలి సమస్యకి పూర్తిగా కోలుకోవడానికి కొంచెం ఎక్కువ రోజులు పడే ఛాన్స్ ఉందంట. కానీ వరస సినిమాలు ఒప్పుకోవడంతో ప్రభాస్ కొంచెం తక్కువ రెస్ట్ తీసుకొని సినిమాలు మళ్ళీ మొదలు పెట్టేసినట్టు.. అందుకే ఇంకా ఈ సమస్య ఆయనకి పూర్తిగా నయం కానీ కొద్దిరోజులు పట్టొచ్చని తెలుస్తోంది.
కాగా ప్రభాస్ కల్కి సినిమా ఈ సంవత్సరం మే 9న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter