Radhe Shyam Movie Director Radha Krishna Kumar praises Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌పై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. 'రాధేశ్యామ్' సినిమా మెయిన్ పాయింట్‌కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారని, విక్ర‌మాదిత్య పాత్ర‌లోని విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిమిమా 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథతో తెరకెక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 11న రాధేశ్యామ్ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలెట్టింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలపై స్పందించారు. 'రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్‌కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు. త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ఆయన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారు' అని అన్నారు. 


'రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్‌లో చేద్దామ‌నుకున్నా. కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్‌కి మార్చాను. అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ అయింది. కరోనాకి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాం. కోవిడ్ ఆంక్ష‌ల కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్‌కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ వేసి షూటింగ్ జ‌రిగింది జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి నిజాతీయగా ఓ విష‌యాన్ని చెప్పాము. అదే ఈ సినిమాకి మెయిన్ కంక్లూజ‌న్' అని రాధాకృష్ణ కుమార్ తెలిపారు. 


'రాజులు, యువ‌ రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్దపెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఇలాంటి కథతో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్. దేశ ప్ర‌భుత్వాల‌నే మార్చేసెంత శ‌క్తిగా సోషల్ మీడియా త‌యారైంది. అన్ని చిత్రాల ప్ర‌మోష‌న్స్‌కి మీడియాతో పాటు సోష‌ల్ మీడియా అవ‌స‌రం. సినిమాని థ‌మ‌న్ త‌న రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లారు. ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉండ‌నుంది. సినిమా మెజార్టీ వీఎఫ్‌ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్‌లోనే చేయించాము' అని డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. 


Also Read: IND Vs SL: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్‌ అనుమానమే!!


Also Read: Chicken Flying: ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే! గాల్లో ఎగురుతూ నదిని దాటిన కోడి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook