Adipurush Shooting Completed: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’ (Prabhas Adipurush). బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓంరౌత్‌ ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘ఆదిపురుష్‌ షూట్‌ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్‌ చేసిన మేజిక్‌ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. దీనిపై రెబల్‌స్టార్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


భారీ బడ్జెట్‌, 3డీ చిత్రంగా రానున్న ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ జోడీగా సీత పాత్రలో నటి కృతిసనన్‌ (Adipurush Cast) సందడి చేయనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకునే లంకేశుడి పాత్రను బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడి పాత్రను సన్నీసింగ్‌ పోషించారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో (Adipurush Budget) రూపొందుతున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. పాన్‌ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11 (Adipurush Release Date)న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం.


ప్రభాస్​ నటించిన రొమాంటిక్ సినిమా 'రాధేశ్యామ్'.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న (Radhe Shyam Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రశాంత్​ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. ఇది కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. 


Also Read: Chiranjeevi Bhola Shankar Movie: భోళా శంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్.. కాస్ట్ అండ్ క్రూ ను ప్రకటించిన చిత్రబృందం 


Also Read: Telangana: రేపు విడుదలవుతున్న కేసీఆర్ బయోపిక్, సినిమాలో ఏముంది అసలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook