Adipurush Movie Collections: ఆదిపురుష్.. అభిమానులు పెట్టుకున్న అంచనాలను తారుమారు చేసిన ఈ మూవీ  కలెక్షన్స్ విషయంలో కూడా అంచనాలకు అందడంలేదు.. మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పైన దాని ప్రభావం పడింది. మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ తో స్టార్ట్ చేసినా వారం తిరక్క ముందే అటక ఎక్కినట్టు కనిపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి రోజు 140 కోట్లు వసూళ్లు సాధించింది. రెండో రోజు, మూడో రోజు 100 కోట్లతో పర్వాలేదు అనిపించినా, నాలుగో రోజు కేవలం 35 కోట్లతో ఒకింత కలవర పెట్టిందనే చెప్పాలి. ఇక ఐదో రోజు 10 కోట్లతో ఫీవర్ తెప్పించింది.. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఐదు రోజుల్లో 395 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం పాట్లు పడుతుంది.


ఆదిపురుష్ మూవీ ఆరురోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?
ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 410 కోట్లు కురిపించింది. ఆరు రోజుల్లో ఈ కలెక్షన్స్ సాధించిందని చెబుతూ యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా దైవిక గాథ అనేకమంది హృదయాలను జయిస్తూనే ఉంది అంటూ ట్వీట్ చేసింది. రిలీస్ తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ లో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ వీకెండ్ తర్వాత డ్రాప్స్ పెరగడంతో మూవీ రీచ్ స్లో అయ్యిందనే చెప్పాలి. ఒక్కసారైనా ఈ మైథలాజికల్ మూవీని చూడాలి అనుకునే ప్రేక్షకుల సంఖ్య ఉండటంతో ఈ వీకెండ్ లో కలెక్షన్స్ రావొచ్చని అంచనా ఐతే ఉందని మూవీ విశ్లేషకులు అంటున్నారు.


Also Read: Adipurush Row: ఆదిపురుష్ చుట్టూ వివాదం, వచ్చే వారం నుంచి సినిమాలో కొత్త డైలాగ్స్


తెలుగు రాష్ట్రాల్లో ఏంటి మూవీ పరిస్థితి..?
చాలా కాలం తర్వాత రాముడిపై సినిమా వస్తుంది అని ఆశలు పెట్టుకున్న ప్రజలు అంతంత మాత్రంగానే సంతృప్తి చెందారని చెప్పాలి. తెలుగు రాష్ట్ర ప్రజలకి  సినిమాపై ఆదరణ చూపించాలని ఉన్నా, సినిమాని ఒకటికి రెండు సార్లు చూసేంత ఏమి లేకపోవడంతో ఆదరణ కరువైందని టాక్ నడుస్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి.. ఐదు రోజుల్లో 75 .70 కోట్లు కలెక్ట్ చేసింది.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు షేర్ 95 కోట్లు కలెక్ట్ చేసిందట.. మన ఆదిపురుష్ సినిమా. 


Also Read: Adipurush Day 2 Collections: రెండో రోజు కూడా ఆగని కలెక్షన్ల వర్షం.. 200 కోట్ల క్లబ్ లో 'ఆదిపురుష్'..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook