Prabhu Deva : ఆయనో నటుడు..అంతకమించి కొరియోగ్రాఫర్...దర్శకుడి గానూ సత్తా చాటాడు. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్  మరెవరో కాదు... ప్రభుదేవా గారు. ఈయన్ను అభిమానులు ముద్దుగా ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పిలుచుకుంటారు. తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు ఈ నటుడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుదేవా(Prabhu Deva) నటుడిగా ఎంత సక్సెస్ సాధించాడో...కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా కూడా అంతే సత్తా చాటారు. ఒకప్పుడు పెద్ద హీరోలకు డ్యాన్స్ కంపొంజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవా...తర్వాత నటుడిగా బిజీ అయిపోయారు. నటనలోనూ తనదైన ముద్ర వేసిన ప్రభుదేవా..తర్వాత దర్శకత్వంపై దృష్టి సారించారు. తెలుగులో ఆయన ఎమ్మెస్ రాజు(MS Raju) బ్యానర్లో  రెండు సినిమాలు చేశారు. టాలీవుడ్(Tollywood) సినిమాలను హిందీలోకి రీమేక్ చేసి మంచి విజయాలు సాధించారు.  ఆ తర్వాత బాలీవుడ్‌(Bollywood)లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారాడు.


Also Read: Memes on Raj Kundra Bail: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా మీమ్స్.. ఆడుకుంటున్న నెటిజన్లు


ఇక ఇప్పుడు మరోసారి నటుడిగా గుర్తింపు తెచుకోవడంకోసం ప్రయత్నలు చేస్తున్నారు ప్రభుదేవా. ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌(Choreographer‌)గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వం(Director Prabhu Deva) వహించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. సల్మాన్ ఖాన్‌(Salman Khan)తో చివరగా చేసిన రాధే(Radhe) సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇక పై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారని తెలుస్తుంది. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా(Bhagira) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook