Jeevitha in MAA Association elections: మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జీవిత పోటీ ?
Jeevitha, Prakash Raj, Manchu Vishnu in MAA Association elections: మా అసోసియేషన్ ఎన్నికల బరిలో అధ్యక్షుడి స్థానానికి జరిగే ఎన్నికకు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడు, మంచు విష్ణు పోటీలో ఉండగా తాజాగా జీవిత రాజశేఖర్ కూడా పోటీకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ ((Actress Jeevitha Rajasekhar)) మా అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు.
Jeevitha, Prakash Raj, Manchu Vishnu in MAA Association elections: మా అసోసియేషన్ ఎన్నికల బరిలో అధ్యక్షుడి స్థానానికి జరిగే ఎన్నికకు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడు, మంచు విష్ణు పోటీలో ఉండగా తాజాగా జీవిత రాజశేఖర్ కూడా పోటీకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (Movie artists association- MAA elections) జరగనున్నాయి. మా ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా ఉండేందుకు, మెజార్టీ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు నూతన కార్యవర్గంలోని పదవులకు పోటీపడే వాళ్లు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ప్రస్తుతం మా అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్ (Actress Jeevitha Rajasekhar) ఈసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేసేందుకు నిర్ణయంచుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే తనకు అనుకూలంగా ఉండే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
Also read : Siggendukura Mama Song: సిగ్గెందుకురా మామా మాస్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్
మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu contesting MAA elections) కూడా సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. వీళ్లలో ఎంతమంది పోటీకి దిగుతారు, ఎవరు నెగ్గుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also read : Ravi Teja's remuneration: క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత రవితేజ పారితోషికం ఎంతో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook