Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..

Prakash Raj Kumbha Mela: కోట్లాది హిందువులు ఎంతో భక్తిగా ఆర్తితో ఈ యేడాది పుష్య పౌర్ణమి (13/1/2025) రోజున ఎంతో ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది రాజకీయ నాయకుడు, సెలబ్రిటీలు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నాలు ఆచరించారు. ఈ కుంభమేళాలో తాజాగా ప్రకాష్ రాజ్ పుణ్యస్నానాలు చేసినట్టుగా ఉన్న ఫోటో వైరల్ అయింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
Prakash Raj Kumbha Mela: దాదాపు 12 యేళ్లకు ఒకసారి గంగా, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో పవిత్ర కుంభమేళా జరగుతోంది. ప్రపంచంలోనే అతిఎక్కువ మంది ప్రజలు పాల్గొనే ఈ వేడుక గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇప్పటికే కోట్లాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ కుంభమేళాలో విలక్షణ ప్యాన్ భారత్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ కూడా కుంభమేళాలో స్నానం ఆచరించినట్టుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై కొంత మంది సనాతన వాదులు మాత్రం.. హిందుత్వం పై పడి ఏడుస్తుంటావు. దేవుడు లేడు నేను దేవుడిని నమ్మను నేను నాస్తికుడిని అంటావు. మరీ చేసిన పాపాలు పోగోట్టుకోవడానికీ ప్రయాగ్ రాజ్ వెళ్లి దేవుడికి దండం పెడుతున్నావు అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు నీ ఏడుపు ఒక్క హిందుత్వంపైనే మిగతా మతాల గురించి పల్లెత్తు మాట అనవు. ఒక్క హిందు మతంలోనే నీకు లోపాలు కనిపిస్తున్నాయి. మిగతా మతాల్లో నీకు ఎక్కడ ఒక్క తప్పు కనపించడం లేదా ప్రకాష్ రాజు అంటూ ఓ రేంజ్ లో ప్రకాష్ రాజ్ రెండు నాలుకల ధోరణిపై దుమ్మేత్తి పోస్తున్నారు.
తాజాగా కుంభమేళాలో తాను పుణ్యస్నానం ఆచరించినట్టుగా ఉన్న ఫోటో పై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఫేక్ న్యూస్ అలర్ట్ అంటూ పోస్ట్ పెట్టారు. ఇలా తన ప్రమేయం లేకుండా తాను నమ్మని సిద్ధాంతం కోసం ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం చేసినట్టుగా ఉన్న ఫోటో పై తాను సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
అంతేకాదు ఈ ఫేక్ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వారిని ఒదలిపెట్టే ప్రసక్తి లేదంటూ ట్వీట్ చేశాడు. మొత్తంగా ప్రకాష్ రాజ్.. కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.