Shyam Singha Roy Movie: నేచురల్ స్టార్ నాని(Hero Nani) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy Movie)’. సాయి పల్లవి (Sai Pallavi), కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ,తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఇవాళ మరో సర్ ప్రైజ్ ను ప్రకటించనుంది శ్యామ్ సింగరాయ్ టీమ్. సిరివెన్నెల సీతారామశాస్తి గారు రాసిన 'ప్రణవాలయ' సాంగ్(Pranavalaya Song) ను నేటి సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ప్రస్తుతం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ సాయిపల్లవికి సంబంధించిన పాటగా తెలుస్తోంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి అలపించారు. ఈ సినిమాకు మిక్కి జే మేయర్(MickeyJMeyer) సంగీతం అందించారు. 




Also Read: Bangarraaju Song: ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా.. తండ్రి-కొడుకులతో మాస్ స్టెప్పులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి