Prashant Varma Hanuman : హనుమాన్ క్రేజ్.. పాన్ వరల్డ్ సినిమా అంటే ఇదే.. కలిసొచ్చేనా?
Hanuman Release in 11 languages హనుమాన్ సినిమాను ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాగా మార్చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన అప్డేట్ చూస్తే అందరికీ మతిపోతుంది. ఆదిపురుష్ సినిమా రేంజ్లో హనుమాన్ సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.
Hanuman Release in 11 languages ఒక్క చిన్న టీజర్ సినిమా స్థాయిని మార్చేసింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆదిపురుష్ ఒక్క టీజర్‌తో పాతాళంలోకి వెళ్లింది. వందల కోట్లు పెట్టారా? పెడితే ఇలా తీస్తారా? ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఆ వీఎఫ్‌ఎక్స్ ఏంటి? అనే స్థాయిలో ఆదిపురుష్‌ను ఆడుకున్నారు. ఇక అదే చిన్న టీజర్‌ను చూసి హనుమాన్‌ను పాన్ ఇండియాగా మార్చారు. ప్రశాంత్ వర్మ పదుల కోట్లు పెట్టి తీసిన సినిమాను ఇప్పుడు పాన్ వరల్డ్‌గా మార్చబోతోన్నారు.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆదిపురుష్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. హనుమాన్ కోసం కూడా అంతే స్థాయిలో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో ఆదిపురుష్ కంటే వంద రెట్లు మేలు అనిపించుకుంది. అందుకే హనుమాన్‌కు ఇంత క్రేజ్ వచ్చింది.
అయితే ఇప్పుడు హను మాన్ సినిమాను పదకొండు భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. చైనా, శ్రీలంక, స్పెయిన్, రష్యా, అమెరికా ఇలా ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు టీం నుంచి అప్డేట్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా ఆదిపురుష్‌కు ఎసరు పెట్టేలా ఉంది. ఒక వేళ ఈ సినిమా గనుక క్లిక్ అయి.. ఆదిపురుష్ తేడా కొట్టేస్తే మాత్రం ప్రభాస్, ఓం రౌత్‌ల పరిస్థితి దారుణంగా మారేట్టు కనిపిస్తుంది.
హనుమాన్ సినిమా ఇప్పుడు టాలీవుడ్ నుంచి వెళ్తోన్న మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా అవుతుంది. మామూలుగా అయితే ఇది ఇప్పుడు పాన్ వరల్డ్ అయిందని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కే రేంజ్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నారన్న మాట. మరి హనుమాన్ గనుక క్లిక్ అయితే అటు తేజ ఇటు ప్రశాంత్ వర్మ ఇద్దరి భవిష్యత్ మారిపోయినట్టే. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి