Salaar 2: సలార్ లో అఖిల్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ భార్య
Akhil in Salaar 2: బాహుబలి తరువాత సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండో భాగం పై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రెండోభాగం గురించి కొన్ని కీలక విషయాలు బయట పెట్టింది ప్రశాంత్ నీల్ భార్య..
Prashanth Neel wife Likitha Reddy: కేజిఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్.. తన తదుపరి ప్రాజెక్ట్ ప్రభాస్ తో అనౌన్స్ చేయగానే ఆ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ కూడా జరిపారు సినిమా యూనిట్. ఈ సక్సెస్ మీట్ కి సలార్ సినిమా టీం తో పాటు అఖిల్ కూడా హాజరయ్యారు. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సలార్ రెండో భాగంలో అఖిల్ ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్త గురించి అలానే మరికొన్ని వార్తల గురించి క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నిల్ భార్య.
ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో సలార్ సినిమా గురించి చిట్ చాట్ నిర్వహించి తమకేమీ సందేహాలు ఉన్న తనని అడగమన్నారు. దీంతో తెగ సంబరపడిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె పైన ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి ప్రశాంత్ నీల్ భార్య లిఖిత సమాధానాలు ఇచ్చి అందరిని తెగ ఖుషి చేశారు.
దేవా(ప్రభాస్) తండ్రిగా పార్ట్ 2లో ఎవరు కనిపించబోతున్నారు.. ఆ పాత్రలో కూడా ప్రభాస్ ని పెట్టొచ్చు కదా అని ఒక అభిమాని అడగగా.. శౌర్యంగా పర్వంలో దేవా తండ్రి పాత్ర ఎవరా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని జవాబు ఇచ్చారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్, జురాసిక్ పార్క్ డైలాగ్ మొదటి పార్ట్ లో లేదు కదా అని అడగగా అవన్నీ
శౌర్యంగపర్వం రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు.. అని జవాబు ఇచ్చారు.
ఇక సలార్ రెండో భాగంలో అఖిల్ ఉంటారా అని అందరిలో ఉండే సందేహాన్ని ఒక అభిమాని అడగగా అది కేవలం రూమర్ మాత్రమే అంటూ అసలు విషయం బయట పెట్టారు లిఖిత రెడ్డి. ఇక దేవా, రాధారమ, ఆద్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ఒక అభిమాని అడగగా దానికి తమాషాగా దీనికి సమాధానం చెప్పాలంటే శౌర్యంగపర్వం స్క్రిప్ట్ నేను దొంగలించాలి అని జవాబు ఇచ్చారు.
ప్రస్తుతం అభిమానులు అడిగిన ప్రశ్నలు దానికి లిఖితారెడ్డి ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter