BB 7 Telugu Voting: ఓటింగ్‌లో దూసుకుపోతున్న కండలవీరుడు.. డేంజర్లో ఆ బ్యూటీ..
BB 7 Voting: బిగ్ బాస్ ఆరో వారం నామినేషన్స్ లో ఉన్నవారి ఓటింగ్ కు సంబంధించిన కొన్ని లెక్కలు లీకయ్యాయి. దీని ప్రకారం, అత్యదిక ఓటింగ్ తో ప్రిన్స్ యావర్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
Bigg Boss 7 Telugu 6th Week Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 07 రసవత్తరంగా సాగుతోంది. కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్ల హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ సోమవారం నామినేషన్స్ సందర్భంగా కొత్తవారిని పోటుగాళ్లుగా, పాత హౌస్ మేట్స్ ను ఆటగాళ్లుగా విడదీశారు బిగ్ బాస్. ప్రస్తుతం ఆరో వారం నడుస్తోంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆరోవారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, టేస్టీ తేజా, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభా శెట్టి ఉన్నారు.
అయితే ఈ వారం ఓటింగ్ లో కండల వీరుడు ప్రిన్స్ యావర్ దూసుకుపోతున్నాడు. 38.17%తో ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సీరియల్ హీరో అమర్ దీప్ 18.55% ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. టేస్టీ తేజ 14.56% ఓటింగ్ తో మూడో స్థానంలో, 10.78 % ఓటింగ్ తో హీరోయిన్ అశ్విని శ్రీ నాలుగో స్థానంలో ఉన్నారు. 7.74 % ఓటింగ్ తో నయని పావని ఐదో ప్లేస్ లోనూ, సీరియల్ హీరోయిన్ పూజా మూర్తి 5.7% ఓటింగ్ తో ఆరో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఇక చివరి స్థానంలో 4.5% ఓటింగ్ తో శోభా శెట్టి ఉంది. దీంతో ఈ అమ్మడు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
బిగ్ బాస్ టాస్కులు పెట్టి కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు. కెప్టెన్సీ సరిగా చేయలేదని పల్లవి ప్రశాంత్ బ్యాడ్జ్ ను లాగేసుకున్నట్లు ఇవాళ ప్రోమోలో చూపించారు మేకర్స్. ‘హూ ఈజ్ ది ఫాస్టెస్ట్’ అనే టాస్క్ పెట్టి కంటెస్టెంట్స్ ను పరుగులు పెట్టించాడు బిగ్ బాస్. మరోవైపు అమర్ దీప్ కు షాకిచ్చాడు పెద్దయ్య. స్విమ్మింగ్ పుల్ లోని నీటిని స్పూన్ తో తోడాలని అమర్ ను ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లు పకపకా నవ్వుకున్నారు.
Also Read: Bigg Boss 7 Telugu: స్పూన్‌తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయమన్న బిగ్ బాస్.. షాక్ లో అమర్ దీప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి