Prithviraj Sukumaran: చిరు, పవన్ రీమేక్స్ పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్.. అంత మాట అనేసారేంటి!
Prithviraj Sukumaran Controversial Comments: పేరుకి మలయాళీ నటుడే అయినప్పటికీ పృథ్వీరాజ్ సుకుమారన్ కి సౌత్ ఇండియా మొత్తం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ నటుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Chiranjeevi and Pawan Kalyan Remakes:
మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ హీరోకి మలయాళం లోనే కాకుండా సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య విడుదలైన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ హీరో. ఈ సినిమాలో దాదాపు ప్రభాస్ కి ఎంత పాత్ర ఉందో పృథ్వీరాజ్ కి కూడా అంతే పాత్ర ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం ఈ హీరో ఆడు జీవితం అనే సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు అన్ని భాషలలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ హీరో ఏకంగా ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పృథ్వీరాజ్ ఈ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
మార్చి 28న ఆడు జీవితం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో పృథ్వీరాజ్ ఈ మధ్య కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మీ సినిమాలు అయ్యప్పన్ కోషియం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, లూసిఫర్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా, ముంబై పోలీస్.. హంట్ సినిమాగా రీమేక్ అయ్యాయి…ఆ సినిమాలు మీరు చూశారా అని అడగ్గా పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..”ముంబై పోలీస్ సినిమా తెలుగులో రీమేక్ అయిందా? అసలు నాకు ఆ విషయమే తెలియదు. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాలు రీమేక్ అయ్యాయి అని తెలుసు కానీ నేను ఆ సినిమాలో చూడలేదు. ఏవో కొన్ని సీన్స్ చూశాను. అయినా ఇప్పుడు రీమేక్స్ చేయాల్సిన అవసరం రాదు. ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి, ఇకముందు రీమేక్ సినిమాలు ఉండకపోవచ్చు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . దీంతో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అయితే పృథ్వీరాజ్ చెప్పిన మాటలలో ఎంతో నిజం ఉంది. ప్రస్తుతం ఉన్న ఓటీపీ కాలంలో అసలు రీమేక్స్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇది ఇప్పటికన్నా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు అర్థమై ఇక మీదట రీమేక్ సినిమాలో ఆపితే వారి అభిమానులు కూడా ఎంతో సంతోషపడతారు అనడంలో అతిశయోక్తి లేదు.
Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook