Priyamani - Bhamakalapam 2: ఆసక్తి రేకిస్తోన్న ప్రియమణి `భామాకలాపం` టీజర్.. ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..
Priyamani - Bhamakalapam 2: ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ `భామాకలాపం 2`. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీని వచ్చే నెల 16 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.
Priyamani Bhamakalapam 2 OTT Release Date: జాతీయ ఉత్తమనటి ప్రియమణి.. ఓ సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగేలా చేసింది. తాజాగా టీజర్‌తో అది పీక్స్ చేరిందనే చెప్పాలి. ఈ టీజర్‌లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయకపు గృహిణిగా కనిపించారు.
అనుపమ తన గత జీవితాన్ని, అపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టి, ఆమె భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. 'అనుపమ అనే నేను, పక్కన వాళ్ళ విషయాలలో తలదూర్చను అని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని" మాట ఇస్తున్నాను అనే డైలాగ్ తో టీజర్‌ను కట్ చేసారు. అదే సమయంలో దారుణంగా హత్య చేయడం కనిపిస్తుంది. ఆ క్రైం నుంచి ఆమె ఎలా బయటపడింది అనే ప్రధానాంశంతో ఈ మూవీని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్‌లో వినోదంతో పాటు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి.
ఈ టీజర్ లో ప్రియమణి, శరణ్య ప్రదీప్ టైమింగ్ మరోసారి నవ్వులు పూయిస్తుంది. డైలాగ్, యాక్షన్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మూవీని ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు & సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మించారు. ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా.. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు లీడ్ రోల్సో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి డైరెక్ట్ చేశారు.
ప్రియమణి భామాకలాపం ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అనుపమ మోహన్ అనే యూట్యూబర్ పాత్రలో ప్రియమణి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సీక్వెల్‌లో ఈమె ఓ చెఫ్ పాత్రలో కనిపంచబోతున్నారు. ఈ చిత్రం ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో మరో 16 రోజుల్లో అందుబాటులోకి రానుంది. మరి భామాకలాపం మాదిరే ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి