Priyanka Chopra and Nick Jonas welcome baby via surrogacy: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. నిక్ జోనస్ (Nick Jonas), తాను తల్లిదండ్రులు అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే ప్రియాంక గర్భం (Priyanka Chopra pregnancy)తో ఉన్నట్లు ఎటువంటి న్యూస్ కానీ.. ఫోటోలు కానీ ఇప్పటివరకు బయటకు రాలేదు. అలాంటిది పీసీ తల్లి ఎలా అయిందనే అనుమానం మీకు రావచ్చు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు సరోగసి (Surrogacy) విధానం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సరోగసి విధానం ద్వారా పండండి బిడ్డని మా కుటుంబంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించడానికి చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు అందరూ సహకరించగలరు. అందరికి మా ధన్యవాదాలు' అంటూ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన భర్త నిక్ జోనస్‌ను ఆమె ట్యాగ్ చేశారు. తమకు బిడ్డ పుట్టిందని నిక్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Also Read: Horoscope Today January 22 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలే!!


ప్రియాంక చోప్రా గుడ్ న్యూస్ చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోయిన్‌లు పూజా హెగ్డే, హ్యూమా క్యురేషి, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనె, లారా దత్తా భూపతి.. నిర్మాత గునీత్ మోంగా లాంటి సెలెబ్రిటీలు ప్రియాంక చోప్రాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అభిమానులంతా సర్ ప్రైజ్ అవుతూ విష్ తెలియజేస్తున్నారు. ఏదేమైనా పీసీ అందరికి స్వీట్ అండ్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది అనే చెప్పాలి. 



బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లారు. వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ అక్కడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తున్న నిక్ జోనస్‌ (Priyanka Chopra - Nick Jonas)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2018లో పీసీ (PC) వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో జోనస్‌ ఇంటిపేరు తొలగించడం పెద్ద దుమారమే చెలరేగింది. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రియాంక వివరణ ఇవ్వడంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడ్డాయి. 


Also Read: Samantha enjoys skiing : మంచుకొండల్లో సమంతా స్కీయింగ్, అది అంత సులభంకాదంటూనే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook