Producer Ahiteja Birthday అక్షర వంటి సినిమాను నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు యంగ్ నిర్మాత అహితేజ. మెగా అభిమాని అయిన అహితేజ.. సినిమాల్లోకి వచ్చి నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్షర మంచి ప్రయత్నంగా నిలిచింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా శశి వదనే అనే సినిమాతో రాబోతోన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వదిలిన కంటెంట్ అందరినీ మెప్పించింది. ఓ చక్కటి పల్లెటూరి ప్రేమ కథను చూపించబోతోన్నట్టుగా అర్థం అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శశి వదనే అంటూ రాబోతోన్న అహితేజ బర్త్ డే నేడు. ఈ క్రమంలో ఆయన భార్య గౌరీ నాయుడు స్పెషల్‌గా ట్వీట్ వేసింది. క్యాస్టూమ్ డిజైనర్‌, సెలెబ్రిటీ స్టైలిష్ట్‌గా బిజీగా ఉండే గౌరీ నాయుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. కానీ తన భర్త కోసం ఇప్పుడు ఇలా ట్వీట్ వేసింది. ఈ ట్వీట్‌లో తన భర్త మీదున్న ప్రేమను చూపించేసింది.


 



ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. కష్టసుఖాల్లో.. మంచి చెడుల్లో.. ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ నువ్ నాతో ఉంటావు.. నేను నీతో ఉంటాను.. నా బెస్ట్ ఫ్రెండ్, నా మొగుడు, నా పంచింగ్ బ్యాగ్‌కు హ్యాపీ బర్త్ డే.. నీ కష్టపడే తత్త్వానికి, నిద్రలేని రాత్రులు గడుపుతూ పడుతున్న కష్టానికి త్వరలోనే ప్రతి ఫలం దక్కుతుంది.. కాలాంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని గౌరీ నాయుడు ట్వీట్ వేసింది.


భార్య పంపిన విషెస్ చూసి నిర్మాత అహితేజ ఎమోషనల్ అయ్యాడు. ఐ లవ్యూ.. నా జీవితంలో దొరికిన అదృష్టానివి నువ్ అంటూ తన భార్య మీదున్న ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇక గౌరీ నాయుడు ఎక్కువగా అనసూయతో కనిపిస్తుంటుంది. అనసూయకు పర్సనల్ స్టైలిష్ట్, క్యాస్టూమ్ డిజైనర్‌గా గౌరీ నాయుడు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్‌లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. అనసూయ అప్పుడప్పుడు తన ఇన్ స్టా స్టోరీలో గౌరీ నాయుడు గురించి చెబుతూనే ఉంటుంది.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook