Leo Title Controversy: `లియో` టైటిల్ వివాదంపై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ.. ఆ రోజే విడుదల..!
Leo Telugu Version Release Date: లియో మూవీ తెలుగు టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. సినిమాను ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 19వ తేదీనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టైటిల్ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.
Leo Telugu Version Release Date: దళపతి విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ'లియో'. త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించారు. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. అయితే హైదరాబాద్ సివిల్ కోర్ట్ ఆదేశాల మేరకు తెలుగులో సినిమా విడుదల ఒక రోజు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
అక్టోబర్ 19న ఉదయం 7 గంటల షోలతో లియో విడుదలవుతుందని తెలిపారు. దసరా సెలవుల్లో ఈ మూవీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వివాదంపై స్పందిస్తూ.. తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిందన్నారు. లియో పేరుతో తెలుగులో టైటిల్ ఒకరు రిజిస్టర్ చేసుకున్నారని.. అయితే వారు తమను సంప్రదించకుండా నేరుగా కోర్టుకు ఆశ్రయించారని తెలిపారు. తనకు కూడా ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు.
ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్లతో మాట్లాతున్నామని.. సమస్య పరిష్కారం అవుతుందన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సినిమా విడుదలలో ఎలాంటి మార్పులేదని.. అక్టోబర్ 19వ తేదీనే తెలుగులో కూడా లియో మూవీ విడుదల అవుతుందని తెలిపారు. లియో తెలుగు టైటిల్‌ను కూడా తమిళ ప్రొడ్యూసర్లే రిజిస్టర్ చేయించారని.. సినిమాకు ఇప్పటికే సెన్సార్ పూర్తియిందన్నారు. లియో రిలీజ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. ముందుగా తెలుగులో రిజిస్టర్ చేసుకున్నవాళ్లకు.. తమకు ఎలాంటి నష్టం జరగకుండా సమస్యను పరిష్కరించుకుటామని పేర్కొన్నారు. ఈ సినిమా బాగుంటుందనే నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకున్నామని.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిరాశపరచరనే నమ్మకం ఉందన్నారు.
లియో మూవీకి థియేటర్ల సమస్య లేదని.. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ఎలాంటి సమస్యల్లేకుండా కావాల్సిన థియేటర్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి పెద్ద హిట్ అవ్వాలని.. అంతకంటే పెద్ద సినిమా బాలకృష్ణతో తాము తీయాలని అనుకుంటున్నామన్నారు. ఈ ఆదివారంలోపు హైదరాబాద్‌లో లియో వేడుక నిర్వహించాలని అనుకుంటున్నామని.. లోకేష్ కనగరాజ్, అనిరుధ్, త్రిష వస్తారని చెప్పారు.
Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!
Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి