Anushka Shetty: తన డ్రైవర్ విషయంలో అనుష్క ఏమి చేసిందో తెలుసా..
Happy Birthday Anushka: అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ చెదిరిపోని ముద్రవేసింది అనుష్క. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి అనుష్క ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె గురించి ఒక నిర్మాత చెప్పిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చూదాం..
Happy Birthday Anushka: అనుష్క శెట్టి....సౌత్ లో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. కెరీర్ స్టార్టింగ్ లోనే అరుంధతి వంటి సినిమాతో తన నటన ప్రతిభని చూపించిన అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ కి కూడా అనుష్క పెట్టింది పేరు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమా కి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అలాంటి స్వీటీ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయాన్నీ చెప్పారు అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
అనుష్క గురించి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…'కొన్నేళ్ళ క్రితం అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం జార్జియా కి వెళ్ళింది. అక్కడ తనని షూట్ లొకేషన్ లో దింపడానికి జాజ అనే డ్రైవర్ ని అపాయింట్ చేశారు. జాజ అతి తక్కువ టైం లోనే అనుష్క కి మంచి ఫ్రెండ్ అయ్యాడు, అనుష్క పట్ల కేర్ తీసుకోవడం, షూట్ కి టైం కి తిసుకేల్లడం మళ్ళి అలాగే జాగ్రత్తగా హోటల్ రూమ్ దగ్గర దింపడం ఇవన్ని జాజ చేసేవాడు. అయితే ఒకరోజు అనుష్క షూట్ కి వెళ్దాం అని కిందకి వచ్చి చూసే సరికి జాజ ప్లేస్ లో వేరే డ్రైవర్ ఉన్నాడు. అప్పుడు మన అనుష్క కి తెలిసిన విషయం ఏంటంటే జాజ తన కార్ కి ఇంట్రెస్ట్ అనేది కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు అని.. అందుకే షోరూం వాళ్ళు వచ్చి జజా కార్ తీసుకొని వెళ్ళిపోయారు అని. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే అనుష్క జాజ ని మేనేజర్ ద్వార పిలిపించుకొని షోరూం తీసుకొని వెళ్లి వెంటనే కొత్త కార్ కొనిచ్చింది' అని తెలియజేశారు.
కాగా ఈ విషయాన్నీ స్వయానా ఆ డ్రైవరే తనకు జార్జియా కి వెళ్ళినప్పుడు చెప్పాడు అని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు ఎక్కడో వేరే దేశం లో ఒకతను ఇబ్బంది పడుతుంటే చూడలేక అతడికి సాయం చేసి అందరికి ఆదర్శంగా నిలిచింది మన అనుష్క శెట్టి. అందుకే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఆమె పుట్టినరోజు సందర్భంగా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇటివలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క అతి త్వరలో భాగమతి 2 కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని సమాచారం.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook