Dimple Hayathi IPS Officer Case టాలీవుడ్ నటి డింపుల్ హయతి తాజాగా వార్తల్లోకి ఎక్కింది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నిందని, తన కారు తో ఢీ కొట్టిందని డింపుల్ మీద కేసు నమోదు అయింది. హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేలు జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నరని సమాచారం. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో హయతి ప్రెండ్ డేవిడ్ ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూబ్లీహిల్స్ పీఎస్‌ల్ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 353, 341, 279ల కింద కేసు నమోదు చేశారు. డింపుల్‌పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేశారు. అయితే డింపుల్‌కు ఆ ఐపీఎస్ అధికారి పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. అయినా తీరు మార్చుకోని డింపుల్ ఆగడాలు శృతి మించడంతోనే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.


దీనిపై డింపుల్ పరోక్షంగా స్పందించింది. పవర్ ఉన్నంత మాత్రాన నిజాలు, అబద్దాలుగా మారవు అంటూ ఇలా ఏదో చెప్పుకొచ్చింది. దీనిపై నిర్మాత ఎస్ కే ఎన్ స్పందించాడు. బాధపడకు.. ధైర్యంగా ఉండూ అని రిప్లై ఇచ్చాడు. ప్రతీ హీరోయిన్ చేసే కామెంట్ కింద కనిపిస్తావ్ అని ఓ నెటిజన్ ఎస్ కే ఎన్‌ను ట్రోల్ చేశాడు. దీంతో ఎస్ కే ఎన్ ఇలా రిప్లై ఇచ్చాడు.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


అమ్మాయి అయితే చేయం.. తెలిసిన అమ్మాయి.. తప్పులు చేయదు.. మంచి వ్యక్తి అని తెలిస్తే సపోర్ట్ చేస్తామని ఎస్ కే ఎన్ కౌంటర్లు వేశాడు. ఇలా మొత్తానికి నేడు డింపుల్ హయతి మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. చివరగా డింపుల్ రామబాణం అంటూ గోపీచంద్‌తో కలిసి సందడి చేసింది.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook