Tiger Nageswara Rao: డైరెక్టర్ మీద అప నమ్మకం తో కోట్లు నష్టపోయిన రవితేజ నిర్మాత..
Tiger Nageswara Rao:
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలం తర్వాత రవితేజ సినిమా మొదటి రోజు నుంచి మంచి టాక్ అందుకుంటోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు మంచి రివ్యూస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అయితే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఫ్యాన్స్ కూడా చాలా కంగారుపడ్డారు. దానికి కారణం సినిమా రన్ టైం. ఈ విషయమై ఇప్పటికి ఎన్నోసార్లు మార్పులు చేర్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాకి రన్ టైం ఎక్కడ మైనస్ పాయింట్ గా మారుతుందో అని అభిమానులు చాలానే కలత చెందారు. కానీ ఎట్టకేలకి చిత్ర బృందం రన్ టైం తగ్గించి సినిమాని విడుదల చేసింది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిత్ర నిర్మాతకి కోట్లలో నష్టం వాటిల్లింది. తనకి ఏకైక కారణం డైరెక్టర్ కి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఎప్పటినుంచో చిత్ర నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు సినిమా రన్ టైమ్ ని 160 నిమిషాలు ఉండేలాగా ప్లాన్ చేయమని చెబుతూనే వచ్చారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా చిత్ర డైరెక్టర్ వంశీకృష్ణ మాత్రం సినిమా రన్ టైం 182 నిమిషాలు చేశారు. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ రన్ టైం ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం కూడా తగ్గిపోతుంది.
ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో రన్ టైం ను 172 నిమిషాలకి కుదించారు. కానీ అది కూడా ఎక్కువ అయిపోతుంది అని కంగారు పడ్డ చిత్ర బృందం ఇప్పుడు సినిమాని ఏకంగా 157 నిమిషాలకి కుదించారు. అలా దాదాపు 30 నిమిషాలు సినిమా ను కట్ చేయాల్సి వచ్చింది. కానీ ఎంతో ఫుటేజ్ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా వేస్ట్ అయిపోయింది. దాని కారణంగా చిత్రా నిర్మాతకి కోట్ల నష్టం కలిగింది.
పైగా సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెన్ అయింది. సినిమా షూటింగ్ సమయంలోనే డైరెక్టర్ తన కంటెంట్ మీద ఉన్న అవగాహనతో రన్ టైం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే నిర్మాతకి ఇప్పుడు నష్టం తగ్గేది అని కొందరు చెబుతున్నారు. అలా డైరెక్టర్ కి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నిర్మాతకి బాగానే నష్టాలు కలిగాయి.
Also read: Sun Transit 2023: సూర్యుడి గోచారంతో ఈ 3 రాశులకు నవంబర్ 17 వరకు పట్టిందల్లా బంగారం
Also Read: Kalyan Ram Devil : నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook