Deepika Padukone admited to kamineni hospital in Hyderabad: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్ర‌స్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలకు సైన్ చేశారు. ప్ర‌స్తుతం తెలుగులో పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్టు కే'తో దీపికా బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. రెబల్ స్టార్ ప్ర‌భాస్‌, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్, బాలీవుడ్ భామ దిశా ప‌టానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రాజెక్టు కే' కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొన్నారట. అయితే దీపికాకు హఠాత్తుగా హార్ట్ బీట్ పెర‌గ‌డంతో.. ఆమె వెంట‌నే హైద‌రాబాద్‌లోని కామినేని ఆస్ప‌త్రికి వెళ్లారట. ఆమెను వైద్యులు పరీక్షించినట్టు సమాచారం. అయితే దీపికా 3 రోజుల క్రితం రెగ్యుల‌ర్ చెక‌ప్‌లో భాగంగా ఆస్ప్ర‌తికి వెళ్లారట. ఆమె ఆరోగ్యంగా ఉంద‌ని, ప్ర‌స్తుతం ప్రాజెక్టు కే షూటింగ్‌లో పాల్గొంటుంన్నారని తెలుస్తోంది. 


దీపికా పదుకొణె 'ప్రాజెక్టు కే'తోనే నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్నారు. ప్రాజెక్టు కే పాటుగా స‌ర్క‌స్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. షారుక్ ఖాన్‌తో కలిసి ప‌ఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హాం కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో పాటు ఫైట‌ర్ చిత్రంలో కూడా పొడుగుకాళ్ల సుందరి న‌టిస్తున్నారు. మరోవైపు దీపికా ఓ హాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Also Read: Indonesia Open 2022: తొలి రౌండ్‌లోనే ఓటమి.. ఇండోనేషియా ఓపెన్ నుంచి సింధు, ప్రణీత్ అవుట్!


Also Read: Bhuvneshwar Kumar T20 Record: మరొక్క వికెటే.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న భువనేశ్వర్‌ కుమార్!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook