Project-K Movie Motion Poster Release Date Confirmed: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ అభిమానులను పూర్తి నిరాశపరిచింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికి.. నాలుగో రోజు నుంచి సగానికిపైగా పడిపోయాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ రాబోయే సినిమాల ద్వారానైనా తమ హీరో సాలిడ్ హిట్ కొట్టాలని  ఆశిస్తున్నారు. అందుకే సలార్, ప్రాజెక్టు-కే చిత్రాల అప్ డేట్స్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీరిద్దరి కాంబోలో 'ప్రాజెక్ట్-కె' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్‍, మోషన్ పోస్టర్‌ను జూలై రెండవ లేదా మూడవ వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని లాంచ్ ఈవెంట్ యూఎస్ఏలో గ్రాండ్ గా జరగబోతుందని సమాచారం. వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


Also Read: Leo First Look Controversy: దొరికేసిన లోకేష్ కనగరాజ్.. లియో ఫస్ట్ లుక్ ఆ సినిమా పోస్టర్ కు కాపీనా?


ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంతోషన్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ వరల్డ్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్‍ బచ్చన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ కూడానటిస్తున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని జనవరి 12, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ మూవీ టీజర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.


Also Read: Malli Pelli On OTT: ఇవాళ్టి రాత్రి నుంచే ఓటిటిలోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook