Property Disputes Between Naresh and Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్ లో పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ 345 సినిమాల్లో నటించారు. అయితే తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు కావడంతో ఇప్పుడు వారి ఆస్తుల వ్యవహారం మీద వివాదం చెలరేగిందనే ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే తనకు మేనకోడలు వరుసయ్యే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె ద్వారా కృష్ణకు ఐదుగురు సంతానం కలిగారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, పద్మావతి, ఇందిరా ప్రియదర్శిని అనే ఐదుగురికి ఈ జంట జన్మనిచ్చింది. తర్వాత కృష్ణ తనతో పాటు సినిమాల్లో నటిస్తున్న విజయనిర్మలను ప్రేమించి తన మొదటి భార్య ఇందిరా దేవి అనుమతితోనే వివాహం చేసుకున్నారు. వాస్తవానికి విజయనిర్మలతో వివాహం జరిగిన తర్వాతే కృష్ణ ఇందిరాదేవి సంతానంలో కొందరు జన్మించారు. అంటే వీరిద్దరి వివాహాన్ని ఇందిరాదేవి పూర్తిగా అంగీకరించారని అంటూ ఉంటారు.



అయితే కృష్ణ విజయనిర్మలకు ఎలాంటి సంతానం కలగలేదు కానీ విజయనిర్మలకు మొదటి భర్త ద్వారా నరేష్ అనే సంతానం కలిగారు. నరేష్ తర్వాత కాలంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే పవిత్ర లోకేష్ ఆహారంలో ఆయనకు బాడ్ నేమ్ అయితే వచ్చింది. ఇక మహేష్ బాబు హీరోగా కొనసాగుతున్నారు రమేష్ బాబు ఇటీవల కాలం చేశారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కృష్ణ ఆస్తుల విషయంలో నరేష్ అలాగే మహేష్ కుటుంబ సభ్యుల మధ్య  వివాదం ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత నట్టి కుమార్.


సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తులలో నటి కుమార్ కూడా ఒకరు.  ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, కుటుంబ సభ్యుల మధ్య అంతా సఖ్యత గానే ఉందని చెప్పుకొచ్చారు. అసలు కృష్ణ ఆస్తులలో విజయనిర్మల గారి జోక్యం లేదని విజయనిర్మల గారి ఆస్తులలో కృష్ణ జోక్యం లేదని ఆయన అన్నారు.


మొన్నటి వరకు కృష్ణ నివాసం ఉంటున్న నివాసం విజయనిర్మల గారిదని కృష్ణ విజయనిర్మల ఇద్దరూ కలిసి దాన్ని ఎంతో అపురూపంగా  కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక విజయనిర్మల గారి ఆస్తులన్నీ నరేష్కు చెందుతాయి కాబట్టి ఆ నివాసం కూడా నరేష్ కి వెళుతుందని ఇందులో మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.


కృష్ణ తాను సినిమాల నుంచి విరవించుకుంటున్న సమయంలోనే ఎవరెవరికి ఎంత ఆస్తి దక్కాలనే విషయం మీద పూర్తి అవగాహనతో వాళ్ళందరికే అవి పంచేశారని, తన కొడుకులకు కూతుర్లకు మాత్రమే కాకుండా తన సోదరులకు సోదరీమణులకు కూడా ఆస్తులు పంపకం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎవరో కావాలని వివాదాలు సృష్టిస్తున్నారు కానీ వారి కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని నట్టి కుమార్ పేర్కొన్నారు.
Also Read: Ratan Tata Biopic: రతన్ టాటా బయోపిక్ కు రంగం సిద్ధం.. హీరో ఎవరంటే?


Also Read: Kantara Records: కేజీఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టిన కాంతార.. 400 కోట్ల మార్క్ దాటేసి ముందుకు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook