Puli The 19th Century Movie మన సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. ఇతర భాషల సినిమాలు మన తెలుగు భాషలోకి డబ్ అవుతున్నాయి. ఓటీటీలో ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. తాజాగా మరో డబ్బింగ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. 'పులి-19వ శతాబ్దం' శనివారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళంలో వచ్చిన 'పథోంపథం నూట్టండు' యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు 'పులి-19వ శతాబ్దం' పేరుతో తెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిజు విల్సన్ ఓ యోధుడిలా నటించాడు. కత్తి వీరుడిగా సిజు విల్సన్ నటించాడు. 19వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్‌లో ఈ కథ జరిగినట్టుగా సంబంధించిన కథతో ఈ మూవీని తెరకెక్కించారు. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను పట్టుకునే పాయింట్‌తో ఈ ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సినిమాలోని విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి.


ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ గురించి విమర్శకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈ సినిమా అద్భుతమని కొనియాడారు. ఈ సినిమాలో నాటి పరిస్థితులు, అంటరానితనం ఎలా ఉండేదో కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ మూవీ విషయంలో వినయన్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. నాని దసరా, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు అందించిన సంగీతం బాగానే కలిసి వచ్చింది.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


అజయన్ చల్లస్సెరీ వేసిన సెట్స్, షాజి కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్‌, ధన్యా భాలకృష్ణన్ కాస్ట్యూమ్స్‌కి కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమాకు  మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook