Puri Jagannadh Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత రామ్ తో పూరీ సినిమా.. ఈ సారి ఏమవుతుందో?
Puri Jagannadh announces his Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా ఏది అయి ఉంటుందో? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
Puri Jagannadh announces the sequel to 'iSmart Shankar': ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత లైగర్ అనే సినిమా చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా తెరకెక్కిన లైగర్ సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. అయితే ఈ సినిమాని విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అయితే గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ దెబ్బతో ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ పూర్తిగా నష్ట పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీరికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు.
Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!
అయితే తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఆసక్తికరమైన ప్రకటన ముందుకు వచ్చేసింది. అదేమిటంటే పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా రామ్ పోతినేనితోనే ఉండబోతుందనే విధంగా ప్రకటన చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు వీరి నుంచి ప్రకటన వచ్చింది.
ఈ మేరకు ఛార్మి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే పూరీ జగన్నాద్ తన భార్య సహా కుటుంబ సభ్యులందరితో కలిసి సొంత ఊరైన నర్సిపట్నంలో కొన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే సదరు ఫోటోలలో చార్మి కనిపించకపోవడంతో ఆమె పూరీ జగన్నాథ్ కి దూరం అయిపోయిందేమో అని అంచనాలు కూడా వెలువడ్డాయి.
కానీ తాజాగా చార్మి కౌర్ పూరి జగన్నాథ్ నిర్మాతలుగా సినిమా ప్రకటన రావడంతో అదేమీ లేదనే విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. నిజానికి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండతో జనగణమన అనే ప్రాజెక్టు కూడా చేయాల్సి ఉంది. కానీ లైగర్ డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి బ్రేకులు పడ్డాయి. దీంతో ఇప్పుడు పూరీ జగన్నాథ్ మళ్లీ రామ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాని కూడా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ చేస్తున్నామని వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన విడుదల డేట్ కూడా ప్రకటించేశారు.
Also Read: Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook