Puri Jagannadh Clarity on Charmee Kaur: ఛార్మీతో రిలేషన్ పై ఓపెన్ అయిన పూరీ.. అసలు విషయం అదే!
Puri Jagannadh Clarity on affair with Charmee Kaur: తనకు ఛార్మీకి మధ్య ఏదో ఉందని ప్రచారం జరుగుతున్న క్రమంలో క్లారిటీ ఇచ్చారు పూరీ జగన్నాధ్.
Puri Jagannadh Clarity on affair with Charmee Kaur: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి కౌర్ ఇద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారని, పూరి జగన్నాథ్ తన భార్యకు దూరమయ్యాడని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విషయాల మీద నేరుగా ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు కానీ తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ పుకార్లకు పూరీ జగన్నాథ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి చాలామంది హీరోయిన్లు తమ కెరీర్ ముగుస్తోంది అని సూచనలు రాగానే పెళ్లి చేసుకుని సైడ్ అయిపోతారు. కానీ తన చిన్ననాటి నుంచే సినిమా నటిగా మారిన ఛార్మి కౌర్ మాత్రం అలా చేయలేదు.
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ స్టేజ్ లో ఉన్న ఆమె తర్వాత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సైడ్ అయిపోతుందనుకున్నారు కానీ ఆమె దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వచించే సినిమాలను పూరి కనెక్షన్ బ్యానర్ పేరుతో చార్మి నిర్మాణం చేస్తూ ఉండేది. నిజానికి పూరి జగన్నాథ్ తన కెరీర్ మొదట్లోనే వైష్ణో అకాడమీ అనే ఒక నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థను పక్కనపెట్టి మరీ ఛార్మీ కౌర్ తో కలిసి ఆయన పూరి కనెక్ట్స్ బ్యానర్ స్టార్ట్ చేయడమే కాక అందులో కొన్ని సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో మంచి లాభాల బాట పట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు లైగర్ అనే సినిమా చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 25వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్-చార్మీ కౌర్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్- అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో తామిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారాలు జరుగుతూ వస్తున్న నేపథ్యంలో తనకు ఛార్మీ పదమూడేళ్ల వయసప్పటి నుంచి తెలుసని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
సుమారు 20 ఏళ్ల నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ఇక ఈ సంధర్భంగా పూరీ జగన్నాధ్ ఒక లాజిక్ కూడా చెప్పుకొచ్చారు అదేమంటే ఇదే ఛార్మీ ఒక 50 ఏళ్ల మహిళ అయితే ఎవరూ మా విషయాన్ని పట్టించుకునే వారు కాదని అన్నారు. అదే ఒకవేళ ఛార్మీకి వేరే వాళ్లతో పెళ్లి అయినా పట్టించుకునే వారు కాదని అదేమీ లేకపోవడంతోనే అఫైర్ ఉందని, అదీ ఇదీ అంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాక మా ఇద్దరికీ నిజంగానే మామధ్య అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదన్న పూరీ అట్రాక్షన్ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని వేదాంతం చెప్పుకొచ్చారు. స్నేహమే శాశ్వతమన్న ఆయన నేను ఛార్మీ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.
Also Read: God Father Teaser Update: బర్త్ డే ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఖాయమట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి