Pushpa 2: స్మగర్లు హీరోలా.. పుష్పపై ఓ రేంజ్ రెచ్చిపోయిన సీపీఐ నారాయణ.. బన్నికి ఇచ్చిపడేసాడుగా..
Pushpa 2 - CPI Narayana: సీపీఐ తెలుగు రాష్ట్ర అగ్ర నాయకుడు నారాయణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం ఆయన నైజం. తాజాగా పుష్ప సినిమాపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. గతంలో కూడా ఈ సినిమాపై ఇదే వ్యాఖ్యలు చేసినా.. తాజాగా పుష్ప 2 ఇష్యూతో మరోసారి ఈ సినిమా హీరోతో పాటు దర్శక, నిర్మాతలపై తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు.
Pushpa 2 - CPI Narayana: ఒకప్పుడు హీరోలంటే.. రాముడు మంచి బాలుడు అన్న తరహాలో ఉండేది. ఒకవేళ హీరో దొంగనో.. డాన్ గానే ఉంటే ఆ తర్వాత అతనిలో పరివర్తన వచ్చి మారేలా చూపించేవారు దర్శకులు. రాను రాను ఇపుడు స్మగ్లర్లు, హంతకులు, డాన్లు తెరపై హీరోలవుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. అంతేకాదు పుష్ప సినిమాపై రెచ్చిపోయారు. స్మగ్లర్స్ వ్యవస్థకు, ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ క్రూరమయిన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు.
హీరో చేసే హింసను నేర ప్రవృత్తిని ‘తగ్తేదే లేదు’ అంటూ డైలాగులు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజాం పెడదోవన పట్టే అవకాశం ఉందన్నారు. యువకులను పెడదోవ పట్టించే సినిమాను తీసిన బడుద్దాయి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ అంటూ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన ప్రేక్షకుల నడ్డి విరిచేలా చేసిన తెలంగాణ ప్రభుత్వం మొదటి దోషి అన్నారు.
ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలిచ్చినా.. ఓ అర్ధం ఉంది. ముఖ్యంగా స్మగ్లింగ్ ను ప్రోత్సహించే ఇలాంటి సినిమాలకు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన.. అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ముఖ్యంగా అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరించారు. కానీ సినిమాకు హీరో తీసుకునే రెమ్యునరేషన్ పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల విన్నపాన్ని ఆలకిస్తారా..
పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చిని చూడగలవా అని ప్రశ్నించారు. "లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి " అనే చీపు డైలాగులు.. ఇది ఏ కళకు నిదర్శనం అన్నారు. ఏ తెలుగు భాషకు, యాసకు ఆదర్శం మన్నారు. ప్రముఖ సినిమా కుటుంబమైన "అల్లు " తరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడం ఎంత వరకు న్యాయం అన్నారు. మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోడానికి తెగించి ఆమె బలి కావడం శోషనోయం. అందులో ఆ కటుంబం సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చారే తప్ప హీరోను చూడడానికి రాలేదు.
చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడేచ్చేమోగాని రాజకీయనాయకులు అంత కక్కుర్తి పడాలనాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలి . ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు , సాహితీవేత్తలు , సామజిక స్పృహ వున్నవాళంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. . బాధిత కుటుంబానికి పుష్ప యాజమాన్యం యిచ్చే ముదనష్టపు ఆర్థికసాయాన్ని తిరస్కరించాలన్నారు. ప్రభుత్వం , సభ్యసమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో ఈ కుటుంబానికి నా తరుపున పార్టీ తరుపున మా వంతు సాయం ప్రకటిస్తానన్నారు సీపీఐ నారాయణ.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..