Upcoming Telugu Movies 2024: ఓటీటీల పుణ్యమా అని.. దాదాపు సగం మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సినిమాలో చూడటం ఎప్పుడు మానేశారు. సినిమా చాలా వైవిద్యంగా ఉంటే మాత్రమే చిన్న హీరోల సినిమాలు థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అభిమానులు. మరోవైపు కేవలం స్టార్ హీరో సినిమాలకు మాత్రమే.. థియేటర్ల దాకా వెళ్లడానికి..  ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి.. స్టార్ హీరోల.. సినిమా విడుదలకు సంవత్సరాలు పడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల వైఖరి అభిమానులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు విడుదల తేదీ ప్రకతిస్తే ఆ విడుదల తేదీకి ఎలాగైనా సినిమా విడుదల చేసేవారు చిత్ర యూనిట్. కానీ ఇప్పుడు విడుదల రోజు వరకు అభిమానులకు క్లారిటీ లేకుండా పోతోంది. మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో వస్తోన్న ఓజీ సినిమా.. సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా లేకుండా.. చాలా సైలెంట్ గా చిత్ర బృందం అనుకున్న తేదీ నుంచి సినిమాని సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇక మరో పక్క అదే రోజున ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కాబోతోంది. దేవర సినిమాకి కూడా ఇప్పటికి దాదాపు మూడుసార్లు విడుదల తేదీ మార్చుకుంటూ వచ్చారు. మరోవైపు భారీ అంచనాల మధ్య అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2.. ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రం ఏకంగా డిసెంబర్ నెలకి వెళ్ళింది. ఇక ఈ జూన్ 27న విడుదల అవుతున్న కల్కి సినిమా.. ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడి ఫైనల్ గా..జూన్ 27 కు వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం.


కనీసం తమ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు.. అనే విషయం గురించి కూడా సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా అధికారికంగా ప్రకటించకపోవడం ద్వారా.. ముందుగా డేట్ ఫిక్స్ చేసుకున్న.. చిన్న సినిమాలు అయోమయంలో పడుతున్నాయి. మామూలుగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు విడుదల కానప్పుడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాయి. ఎందుకంటే అలాగైనా తమకు థియేటర్స్ దొరుకుతాయని. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో.‌.చిన్న సినిమాల భవిష్యత్తు అర్థం కాకుండా మారిపోయింది.



ఏదేమైనా స్టార్ హీరోలు తమ స్టార్ డం ని అడ్డం పెట్టుకొని.. అభిమానులను సంవత్సరాల తరబడి ఎదురుచూపుల్లో ఉంచడమే.. కాకుండా చిన్న బడ్జెట్ చిత్రాలకు నరకం చూపిస్తున్నారు. ఈ వైఖరి పెద్ద సినిమా యూనిట్స్ ..మార్చుకుంటే ఎప్పటికైనా మంచిది అని అంటున్నారు అభిమానులు.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter