Thammareddy vs Allu Arjun: తమ్మారెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు, ఒక్కడి ఈగో కోసం అందరూ తలవంచాలా

Thammareddy vs Allu Arjun: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఉదంతంపై తెలుగు సినీ పరిశ్రమలో భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగుతుండటంతో అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. తాజాగా ఇదే జరిగింది.
Thammareddy vs Allu Arjun: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగడుంతో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడంతో తెలుగు సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను బాధ్యునిగా చేస్తూ అరెస్ట్ చేసింది. ఆ తరువాత అల్లు అర్జున్ బెయిల్‌పై బయటికొచ్చినా ఇంకా ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వివాదం సమసిపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెట్టి వెంకట్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించారు. సినిమా హీరోలు బాధ్యతాయుతంగా మెలగాలంటూ అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షో, ప్రత్యేక షోలు, టికెట్ పెంపు ఉండవని తేల్చి చెప్పడంతో తెలుగు సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు.
సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సహా పెద్ద సినిమాలు రానున్నాయి. టికెట్ పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి లేకుంటే ఆర్ధికంగా నష్టపోవల్సి వస్తుందని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆశించిన ఫలితాలుండవచ్చని భావించారు. కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి అదే విషయాన్ని రిపీట్ చేసారు. రేవంత్ రెడ్డి నిర్ణయం కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లవచ్చు. అందుకే అల్లు అర్జున్‌ని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఒక్కడి కోసం ఇంతమంది అంటే మొత్తం సినీ పరిశ్రమ తలవంచాల్సి వస్తోందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ హత్య చేశాడని తాను అనడం లేదని కానీ తప్పయితే జరిగిందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. రోడ్ షో చేయడం ద్వారా తనకు తెలియకుండా తప్పు జరిగితే ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేశాడంటున్నారు. ఫలితంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా ముఖ్యమంత్రి ముందు సిగ్గుతో తలవంచుకోవల్సి వచ్చిందన్నారు. ఒక మనిషి ఈగో కోసం మొత్తం అంతా బలవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు.
Also read: IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి