Sandhya Theatre stampede: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబరు 4న తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా... ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నాడు.  అయితే.. పుష్ప2 టీమ్ నుంచి బాధిత కుటుంబానికి రెండు కోట్ల పరిహారంను ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్‌ ఎలమంచిలి రవి.. మొదలైన వారు.. బాలుడు శ్రీతేజ్‌ తండ్రిని మరోసారి పరామర్శించినట్లు తెలుస్తొంది. రేవతి కుటుంబానికి అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.


 అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 25 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. రేపు సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ ఛాంబర్ తోసమావేశం ఉంటుందని తెలిపారు.  బాలుడు శ్రీతేజ్ తొందరగా కొలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా చెప్పుకొచ్చారు.  రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా తమతొ అయినంత వరకు సాయం చేస్తామని కూడా అల్లు వింద్ క్లారిటీ ఇచ్చారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.