Pushpa 2 - Rashmika Mandanna as srivalli: వరల్డ్ వైడ్‌గా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈ సినిమాలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు ధీటుగా శ్రీవల్లి పాత్రలో రష్‌మిక మందన్న ఒదిగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లిగా రష్మిక లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు.  తాజాగా విడుదలైన లుక్‌లో రష్మిక మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగష్టు 15 కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికొస్తే..  కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫర్‌గా  మిరోస్లా క్యూబా బ్రోజెక్ వ్యవహరిస్తున్నారు.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే.
పాటలను చంద్రబోస్ రాస్తున్నారు. బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్


 




రష్మిక మందన్న విషయానికొస్తే.. సినిమా సినిమాకు తన యాక్టింగ్‌తో అందరినీ ఫిదా చేస్తోంది. గతేడాది 'మిషన్ మజ్ను' 'యానిమల్‌' మూవీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇపుడు రాబోయే 'పుష్ప 2'తో ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.


Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook