Pushpa 3rd Song Release Date: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ చిత్రం 'పుష్ప' (Pushpa Movie Updates). ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో విడుదలైన సినిమాలు సూపర్​ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి మూడో చిత్రం 'పుష్ప'పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun News) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్స్​గా తెరకెక్కిస్తుండగా.. మొదటి భాగమైన 'పుష్ప ది రైజ్​'ను డిసెంబరు 17న థియేటర్లలో విడుదల (Pushpa Movie Release Date) చేయనుంది చిత్రబృందం. రిలీజ్​ డేట్​ దగ్గరు పడనుండడం వల్ల సినిమా ప్రమోషన్స్​లో జోరు చూపిస్తోంది చిత్రబృందం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే 'చూపే బంగారమాయేనే శ్రీవల్లీ' (Srivalli Song) అనే లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram Song) పాడారు. చంద్రబోస్ (Chandra Bose) రాసిన ఈ గీతం మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఇప్పుడు 'పుష్ప' చిత్రంలోని మూడో సాంగ్​ 'సామి సామి'కి (Saami Saami Promo Song) సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్​ విడుదల చేసింది. ఈ పూర్తి పాటను అక్టోబరు 28న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  



ఈ సినిమాలోని అధికభాగం షూటింగ్​ ఆంధ్రప్రదేశ్​ లోని మారేడు మిల్లి అడవుల్లో (Maredu Milli Forest) పూర్తి చేసింది చిత్రబృందం. మిగిలిన ప్యాచ్​ వర్క్​ను ప్రస్తుతం హైదరాబాద్​లో (Hyderabad) ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ ఏడాది అల్లు అర్జున్​ బర్త్​డే సందర్భంగా విడుదలైన 'పుష్ప' టీజర్​తో ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 


అంతకు ముందు ఈ సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​ 'దాక్కో దాక్కో మేక'ను (Dakko Dakko Meka) ఆగస్టు 11న విడుదల చేసింది. ఈ పాటలో బన్నీ ఊరమాస్​ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 17న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ (Mytri Movie Makers Banner) పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాకుండా యాంకర్ అనసూయ (Anchor Anasuya), సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 


Also Read: 67th National Film Awards: 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు గానూ నేషనల్​ అవార్డ్స్​ అందుకున్న దర్శకనిర్మాతలు


Also Read: Pushpa Movie Second Song: 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే'..పుష్ప మ్యూజికల్ బీట్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.