Allu Arjun warns Sreeleela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న అన్ని చిత్రాలు మరే  హీరోయిన్ చేతిలో లేవనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు హీరో అల్లు అర్జున్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ, దానిని రిజెక్ట్ చేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయంలోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2  సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమాలో కూడా శ్రీ లీల నే మొదట హీరోయిన్ గా అనుకున్నారట మేకర్స్.  అయితే శ్రీ లీలా మాత్రం అల్లు అర్జున్ సినిమాకు  డేట్స్ కాళీ లేక వదులుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 


కథ నచ్చినప్పటికీ,  అందులోను ఐకాన్ స్టార్ తో సినిమా అనేసరికి ఎగిరి గంతేసిందట. కానీ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లే ఈ సినిమా కథను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం. 


ఇకపోతే ఈ విషయంపై అల్లు అర్జున్ శ్రీలీలకు ఫోన్ చేసి మాట్లాడారని వార్తలు వినిపిస్తున్నాయి.  నా సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ తనదైన శైలిలో బన్నీ శ్రీలీలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట.  అంతేకాదు శ్రీ లీలా కి అల్లు అర్జున్ స్వయంగా ఫోన్ చేయడంతో ఇక ఆమె అన్నింటినీ పక్కన పెట్టి ఆయన కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 


ఏది ఏమైనా అల్లు అర్జున్, శ్రీ లీల కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.  మరోవైపు పుష్ప -2  సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంది.. గతంలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పేరు వినిపించాయి. కానీ అందరూ కూడా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయడంతోనే ఇప్పుడు శ్రీ లీలను ఫైనల్ చేసినట్లు సమాచారం..


 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.