Allu Arjun gift to Navdeep : టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. సందర్భమేమీ లేకపోయినా ప్రేమ కొద్ది నవదీప్‌కు ఆ కానుక అందించాడు. అల్లు అర్జున్ కానుకకు మురిసిపోయిన నవదీప్.. థ్యాంక్స్ బావ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆ గిఫ్ట్‌ను పోస్ట్ చేశాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటంటే... 'ఎయిర్‌పోడ్స్'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఎయిర్‌పోడ్స్‌ను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన నవదీప్... 'హద్దులు లేనంత ప్రేమ ఉన్నప్పుడు.. సందర్భమేమీ లేకుండానే గిఫ్టులు వచ్చేస్తాయి... థాంక్స్ బావ.. సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పోడ్స్ వాడుతా...' అని పేర్కొన్నాడు. ఈ ఇద్దరు హీరోల స్నేహానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.


[[{"fid":"231205","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అల్లు అర్జున్-నవదీప్‌ల మధ్య ఆర్య 2 సినిమా నుంచి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్‌ కొనసాగుతోంది. గత నెల 8న సెర్బియాలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకల్లో నవదీప్ కూడా పాల్గొన్నాడు.


సినిమాల విషయానికొస్తే... తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై' సినిమాతో 2004లో నవదీప్ సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోలో హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. చివరిసారిగా గతేడాది విడుదలైన మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాలో విజయ్ పాత్రలో కనిపించాడు. సినిమాలతో కాస్త గ్యాప్ వచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉన్నాడు.


ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే 'పుష్ప ది రైజ్' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఐకాన్ స్టార్... త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 


Also Read: India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?


Also Read: Amit Shah Hyd Visit: అమిత్ షా జీ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి... కేంద్రమంత్రిని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.